Advertisement
Google Ads BL

‘రాయలసీమ లవ్‌స్టోరీ’ లుక్ అదిరింది..!!


డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా రాయలసీమ లవ్ స్టోరీ మోషన్ పోస్టర్ విడుదల

Advertisement
CJ Advs

వినోద ప్రధాన చిత్రాలకు పెద్ద పీట వేసే దర్శకులు జి. నాగేశ్వర్ రెడ్డి  రాయలసీమ లవ్ స్టోరీ చిత్ర మోషన్ పోస్టర్ ని , ఫస్ట్ లుక్ ని  విడుదల చేసారు . ఏ వన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా - నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాయలసీమ లవ్ స్టోరీ’. వెంకట్ ని హీరోగా పరిచయం చేస్తూ హృశాలి గోసవి‌ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ఈ రాయలసీమ లవ్‌స్టోరీ . తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పావని మరో హీరోయిన్ గా నటిస్తోంది. నాగినీడు, నల్లవేణు, పృథ్వీ, జీవా, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు, గెటప్ శ్రీను, మధుమణి, మిర్చి  మాధవి, జబర్దస్త్ కొమరం, రాజమౌళి, సన్నీ, భద్రం, ప్రసన్న కుమార్ తదితరులు నటించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని, మోషన్ పోస్టర్‌ని దర్శకులు జి. నాగేశ్వర్ రెడ్డి రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు . రాయలసీమ లవ్ స్టోరీ టైటిల్ లోనే ఏదో మ్యాజిక్ ఉందని , ఇప్పటివరకు రాయలసీమ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉన్నట్లు అందునా యువతకు నచ్చేలా అన్ని అంశాలు ఉన్న చిత్రంగా కనిపిస్తోంది. ఈరోజుల్లో సినిమాలు తీయడం, వాటిని రిలీజ్ చేయడం చాలా కష్టం అలాంటిది మా ప్రాంతం నుండి వచ్చిన ఈ చిత్ర బృందం సినిమాని దిగ్విజయంగా పూర్తిచేయడమే కాకుండా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు అంటే గొప్ప విషయమే! ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లతోనే మన సినిమా ఎలా ఉండబోతోందో స్పష్టంగా చెప్పగలగాలి అలా ఈ రాయలసీమ లవ్ స్టోరీ ఉందనిపిస్తోంది. యువతకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లతోనే అంచనాలు పెరిగేలా చేసిన యూనిట్ ని అభినందిస్తున్నాను అలాగే సినిమా మంచి విజయం సాధించాలని అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నామన్నారు . 

దర్శకులు రామ్ రణధీర్ మాట్లాడుతూ.. నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు నిర్మాతలు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతమైన ఔట్ ఫుట్ వచ్చింది. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు నా కృతఙ్ఞతలు. యువతని టార్గెట్ చేస్తూ రూపొందించిన మా రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. మా చిత్రంలో అద్భుతమైన పాటలున్నాయి. ఎలేందర్ ఇచ్చిన ట్యూన్స్ ట్రెండ్ అవ్వడం ఖాయం.  ఇక ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జి. నాగేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా మా సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఈ సందర్బంగా జి. నాగేశ్వర్ రెడ్డిగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు . 

చిత్ర నిర్మాతలు రాయల్ చిన్నా - నాగరాజు లు మాట్లాడుతూ..‘‘రామ్ రణధీర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం. సినిమా రష్ చూసుకున్నాం చాలా బాగా వచ్చింది. ఈరోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేది యువతరమే కాబట్టి వాళ్లకు నచ్చే విధంగా ఈ సినిమాని రూపొందించడం జరిగింది. నాగేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా మా సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం మాకు మరింత సంతోషాన్ని ఇస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. 

Raayalaseema Love Story First Look Released:

G Nageswara Reddy Released Raayalaseema Love Story First Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs