Advertisement
Google Ads BL

RRR లాంచ్: చీఫ్ గెస్ట్ ప్రభాస్ కాదట.. ఆ సీఎం?


బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాదు... యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఇండియాలో పలు భాషల్లో విడుదలైన బాహుబలి ఆయా భాషా చిత్రాల రికార్డులను తుడిచి పెట్టేసింది. ఏ స్టార్ హీరో అందుకోలేనంత ఎత్తులో బాహుబలి కూర్చుంది. అందుకే రాజమౌళి నెక్స్ట్ చిత్రంపై ట్రేడ్ లోనూ, ప్రేక్షకుల్లోనూ అంత ఆసక్తి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ తో భారీ మల్టీస్టారర్ ని ఎనౌన్స్ చేసి కామ్ అయిన రాజమౌళి ఇప్పుడు ఆ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. నవంబర్ 11 వ తారీఖున 11 గంటలకు #RRR ప్రాజెక్ట్ ని ఆఫీషియల్ గా రాజమౌళి మొదలు పెట్టబోతున్నాడు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి కనిపిస్తేనే అభిమానులకు పండగ.. అలాంటిది ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి డార్లింగ్ ప్రభాస్ వస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వీర విహారం చేస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ #RRR గ్రాండ్ ఓపెనింగ్ కి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నాడనే న్యూస్ వినబడుతుంది. చంద్రబాబు, హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్ కి దగ్గరవడం, అలాగే ఆ మధ్యన బాలయ్య అరవింద సమేత సక్సెస్ మీట్‌కి రావడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్ ఓపెనింగ్ కి చంద్రబాబు వస్తారని అంటున్నారు. అలాగే రాజమౌళి తో ఉన్న సన్నిహిత సంబంధాల వలన కూడా బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.

రాజమౌళి ఏపీ రాజధాని అమరావతి డిజైన్స్  ని ఫైనల్ చేసే విషయంలో చంద్రబాబుకి దగ్గరయ్యాడు. అందుకే చంద్రబాబు.. రాజమౌళి కొత్త సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేస్తారని అంటున్నారు. ఇక రాజమౌళి కొత్త సినిమాని ఎలాంటి హంగామాతో  ఓపెనింగ్ చేస్తాడో కానీ.... ఇప్పటికే ఎన్టీఆర్ అండ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ #RRR ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరవ్వాలని భావిస్తున్నారట. ఇకపోతే మూవీ ఓపెనింగ్ రోజునే రాజమౌళి... ఎన్టీఆర్, చరణ్ పక్కన నటించబోయే హీరోయిన్స్ ని ప్రకటిస్తాడనే న్యూస్ కూడా వినబడుతోంది.

Rumours on RRR Launch Event Chief Guest:

AP CM Is the Chief Guest for RRR Launch Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs