ఈఏడాది దసరా సీజన్ లో చెప్పుకోవటానికి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఒక్కటి కూడా యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయాయి. ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కానీ కొన్ని ఏరియాస్ లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఓవర్సీస్ లో ఈ కారణం చేతే ప్లాప్ అని డిక్లేర్ చేశారు. అతి కష్టం మీద ఇప్పటి వరకు 95 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసింది.
ఇక విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమా రిజల్ట్ తో విజయ్ తన నెక్స్ట్ మూవీస్ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. రామ్ - అనుపమ కాంబినేషన్ లో వచ్చిన ‘హలో గురు ప్రేమ కోసమే’ కూడా అంతంతమాత్రం ఫలితాన్నే అందుకుంది. రొటీన్ కథ కావడంతో ప్రేక్షకులు దీనిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. విశాల్ ‘పందెం కోడి 2’ చూసిన వాళ్లంతా అరవ గోలకి తలలు పట్టుకున్నారు.
నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘వీర భోగ వసంత రాయలు’ డిజాస్టర్ గా నిలిచింది. కల్ట్ రైజింగ్.. కల్ట్ రైజింగ్ అని ఈ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు కానీ థియేటర్స్ వెళ్లిన వాళ్లు నీరసంగా బయటికి వచ్చారు. ఈ సినిమా రిజల్ట్ తరువాత డైరెక్టర్ ఇంద్రసేన ఏకంగా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. వీటితో పాటు చిన్నా చితకా సినిమాలు ఓ పది దాకా వచ్చాయి కాని అవి రిలీజ్ అయిన సంగతి కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు సినీ లవర్స్ మొత్తం హోప్స్ నవంబర్ మీదే ఉన్నాయ్. ‘సర్కార్’ తో ఆ జోరు సాగనుంది.