Advertisement
Google Ads BL

AAA అప్డేట్: 10న ప్రీరిలీజ్, 16న సినిమా


నవంబర్ 10 న ‘అమర్ అక్బర్ ఆంటొని’ ప్రీ రిలీజ్ ఈవెంట్, నవంబర్ 16 న సినిమా విడుదల

Advertisement
CJ Advs

మాస్ మహరాజా రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా జంటగా  శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా, రెండవ పాటను దీపావళి సందర్భంగా నవంబర్ 6న విడుదల చేయనున్నారు.  రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న ఈ సినిమా  స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కగా ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

తారాగణం: రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు.. 

సాంకేతిక నిపుణులు :

స్క్రీన్‌ప్లే , డైలాగ్స్ మరియు దర్శకత్వం : శ్రీను వైట్ల

కథ:  శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి

నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (CVM)

సహ నిర్మాత: ప్రవీణ్ మార్పురి

సీఈఓ : చెర్రీ

డీఓపీ : వెంకట్ సి దిలీప్

సంగీతం: ఎస్ఎస్ థమన్

ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ

ఆర్ట్ డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్

PRO : వంశీ శేఖర్

Amar Akbar Anthony Pre Release Event Date Fixed:

Amar Akbar Anthony Pre-Release Event on November 10th, Release on November 16th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs