సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పిల్లలకి దాదాపుగా పెళ్ళిళ్ళు అయ్యాయి. చిరు ముగ్గురు పిల్లలకి ఎప్పుడో పెళ్లిళ్లు అయ్యాయి. ఇక బాలయ్య ఇద్దరు కూతుళ్ళకి పెళ్లి అయ్యి కొడుకు మోక్షజ్ఞ మాత్రమే పెళ్ళికి ఉన్నాడు. మోక్షజ్ఞ ఇంకా చిన్నోడే. ఇక నాగార్జున కూడా నాగ చైతన్య కి పెళ్లి చేసాడు. ఇక సీనియర్ హీరోస్ లో వెంకటేష్ తన పిల్లల పెళ్లిళ్లు చెయ్యాల్సి ఉంది. అయితే మొన్నీమధ్యనే వెంకటేష్ డాటర్ ఆశ్రిత పెళ్లి జరగబోతున్నట్టుగా వార్తలొచ్చాయి. ఆశ్రిత ఎవరినో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతుందనే న్యూస్ హైలెట్ అయ్యింది.
అయితే ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో జరగనున్నదట. సురేందర్ రెడ్డి మనవడు, వెంకీ కూతురు ఆశ్రిత మంచి ఫ్రెండ్స్. తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడంతో ఇటు వెంకీ ఫ్యామిలీ అటు సురేందర్ రెడ్డి ఫ్యామిలీ ఈ పెళ్లి విషయమై మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావడం... ఇరు పెద్దలు కలిసి పెళ్ళికి లగ్నం పెట్టుకోవడం జరిగిందని చెబుతున్నారు. కార్తీక మాసం అంటే నవంబర్ 24 న వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం జరగనుందట. అయితే పెళ్ళికి కేవలం 20 రోజులు మాత్రమే ఉండడంతో... ఇరు కుటుంబాల వారు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారని తెలుస్తుంది.
మరి దగ్గుబాటి ఫ్యామిలిలో ఈ పెళ్లి చాలా ప్రత్యేకమైందనే చెప్పాలి. దగ్గుబాటు సురేష్ కొడుకులు రానా, అభిరామ్ లు పెళ్లీడు దాటినా ఇంకా పెళ్లిళ్లు చేసుకోలేదు. ఇక దగ్గుబాటి వెంకటేష్ తన కూతురు ఆశ్రిత పెళ్లిని అంగరంగ వైభవంగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.