Advertisement
Google Ads BL

మరీ ఇంతగా తగ్గితే ఎలా.. తెలుగమ్మాయ్..?


కోలీవుడ్‌ సినీ ప్రేక్షకులు సన్నగా, నాజూకుగా, జీరో సైజ్‌తో ఉండే భామల కంటే కాస్త ముద్దుగా బొద్దుగా ఉండే భామలనే బాగా ఆదరిస్తారు. ఉదాహరణకు నాటి జయలలిత నుంచి ఖుష్బూ, నమిత, హన్సిక వంటి వారెందరో దానికి ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ తెలుగుకి వచ్చేసరికి సన్నగా, స్లిమ్‌గా ఉండే ఇలియానా వంటి భామలను, సైజ్‌జీరో లుక్‌లో కనిపించే బాలీవుడ్‌ అందాలకే పట్టం కడుతారు. ఇక విషయానికి వస్తే మన రాజోలు భామ అంజలి మొదట తెలుగులో 'ఫొటో, ప్రేమలేఖరాశా' వంటి చిత్రాలలో నటించినా కూడా ఈమెకి హీరోయిన్‌గా గుర్తింపు మాత్రం కోలీవుడ్‌లోనే వచ్చింది. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత తమిళంలో, కన్నడలో పలు చిత్రాలలో నటించిన ఈమె వెంకటేష్‌, మహేష్‌బాబుల మల్టీస్టారర్‌ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో టైటిల్‌ పాత్రను పోషించి, సమంత, మహేష్‌కి జోడీగా కనిపిస్తే, ఈమె వెంకీకి జతగా కనిపించింది. ఆ తర్వాత అంజలి రవితేజ 'బలుపు', వెంకటేష్‌, రామ్‌ల 'మసాలా', 'గీతాంజలి, శంకరాభరణం', బాలకృష్ణ 'డిక్టేటర్‌', అల్లుఅర్జున్‌ 'సరైనోడు', 'చిత్రాంగధ' వంటి పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె 'గీతాంజలి' సీక్వెల్‌లో కూడా నటిస్తోంది. కానీ ఈమె బొద్దుతనం కోలీవుడ్‌కి సరిపోతే, అదే ఈమెకి తెలుగులో మైనస్‌ అయింది. దాంతో ఆమె తాజాగా బరువు తగ్గి బక్కచిక్కి పోయింది. ఆమె తాజాగా ఎంతో సన్నబడి కనిపిస్తోంది. ఆమె తన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో పెట్టిన ఫొటోలను చూసి ఈమె అంజలినా అని ఆశ్యర్యపోతున్నారు అందరు. 

నిజం చెప్పాలంటే ఈ ఫోటోలు చూసిన వారు అది అంజలి అంటే నమ్మలేకపోతున్నారు. మరి ఏదైనా సినిమాలోని పాత్ర డిమాండ్‌ చేయడం వల్ల ఆమె సన్నబడిందా? బొద్దుగా ఉంటే అవకాశాలు రావడం లేదనే ఉద్దేశ్యంతో బక్కచిక్కిందా? అనేది తెలియడం లేదు. ఇక ఈమె జైతో సాగిస్తున్న ఎఫైర్‌ గురించి గానీ గతంలో ఈమె పిన్ని విషయంలో ఏర్పడిన వివాదాల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. కాగా ఈ అమ్మడు టాలీవుడ్‌ కోసం సన్నబడిందా? అనే విషయంలో పలువురు మాత్రం ఆమె సన్నగా ఉన్నదానికంటే బొద్దుగా ఉంటేనే అందం చందంతో బొద్దుగా ముద్దొస్తుందని, ఆమె సన్నబడితే ఆమె అందమే పోయిందని కామెంట్స్‌ చేస్తున్నారు. 

Anjali Shared Her Latest Photos:

Anjali Focus on Fitness Revealed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs