Advertisement
Google Ads BL

‘2.O’ ట్రైలర్: ఒక్కొక్కరు కేకలు పెట్టాల్సిందే!


ఎప్పుడెప్పుడా అని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న శంకర్ 2.ఓ ట్రైలర్ ని చాలా గ్రాండ్ గా చెన్నై లో విడుదల చేసింది 2.ఓ టీమ్. 2.ఓ చిత్ర బృందం తో పాటుగా.. పలు భాష జర్నలిస్ట్ లు అలాగే కొంతమంది గెస్ట్ లు పాల్గొన్న ఈ వేడుకని చెన్నై లో చాలా భారీగా నిర్వహించారు మేకర్స్. లైకా ప్రొడక్షన్స్ లో రజినీకాంత్ హీరోగా అమీ జాక్సన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.ఓ సినిమా మీద భారీ నుండి అతి భారీ అంచనాలు ఉన్నాయి. 2.ఓ సినిమా విడుదల కోసం సూపర్ స్టార్ అభిమానులే కాదు... యావత్ దేశమంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. శంకర్ భారీ తనం ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటిలో ప్రేక్షకులు ఉన్నారు. 2.ఓ టీజర్, మేకింగ్ వీడియోస్ తోనే సంచనాలకు తెర తీసిన 2.ఓ టీం ఇప్పుడు 2.ఓ ట్రైలర్ తో మరిన్ని రికార్డులను సృష్టించడానికి రెడీ అయ్యింది. ఈ రోజు శనివారం చెన్నైలో 2.ఓ ట్రైలర్ లాంచ్ వేడుక అంగరంగ వైభవంగా జరగగా... ఈ వేడుకకి శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, లైకా అధినేతలు పాలొన్నారు.

Advertisement
CJ Advs

ఇక 2.ఓ ట్రైలర్ మొత్తం విజువల్ ఎఫెక్ట్ తో నిండిపోయింది. చిట్టిగా రజినీకాంత్, రోబో గర్ల్ గా అమీ జాక్సన్... విలన్ పక్షి అవతారంలో అక్షయ్ కుమార్ ల గెటప్స్ అబ్బా అత్యంత అద్భుతం అన్నట్టుగా ఉన్నాయి. ట్రైలర్ అడుగడుగునా లైకా ప్రొడక్షన్స్ పెట్టిన పెట్టుబడి కనబడింది. హాలీవుడ్ రేంజ్ కి ఎక్కడా తీసిపోని సినిమాని తెరకెక్కించిన శంకర్ పనితాన్ని వేయినోళ్ల పొగిడేస్తున్నారు. రోబో సినిమాలో రోబో చిట్టి అతి తెలివితో మానవాళికి ముప్పుని గమనించి మిస్ మ్యాచ్ చేస్తారు. కానీ ఇప్పుడు 2.ఓ లో చిట్టి రీలోడెడ్ 2.ఓ వెర్షన్ అంటూ విలన్ పక్షి అక్షయ్ కుమార్ భరతం పడుతుంది. 2.ఓ లో సెల్ ఫోన్ నే విలన్ గా చూపించాడు శంకర్. అందుకే సెల్ ఫోన్స్ అన్నిటిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటే.. మానవాళి అంటా తన గుప్పెట్లోకి వచ్చేస్తుందని.. ఇక సెల్ ఫోన్ లేక మానవాళి అతలాకుతలం అవుతుందని చెబుతాడు విలన్ అక్షయ్.

>Click Here for Trailer

అలాగే అత్యంత భయంకరంగా పక్షి ఆకారంలో ప్రజలను మాత్రమే కాదు చిట్టి 2.ఓ ని కూడా భయ భ్రాంతులకు గురి చేసే పాత్రలో అక్షయ్ కుమార్ చెలరేగిపోయాడు. ప్రజలను రక్షించేందుకు చిట్టి 2.ఓ రోబో రజినీకాంత్ తంటాలు పడడం.. ఇలా అంతా గ్రాఫిక్ మాయాజాలమే అన్నట్టుగా శంకర్ అందరిని అలా కట్టిపడేశాడు. 2.ఓ విజువల్ ఎఫెక్ట్స్ కోసం శంకర్ అంతగా ఎందుకు వెయిట్ చేసాడు అనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక హీరోయిన్ అమీ జాక్సన్ ని రోబో తయారు చేసే రజినీకి అసిస్టెంట్ గా చూపించారు. అమీ జాక్సన్ అందాన్ని చూసిన చిట్టి వావ్.. అనకుండా ఉండలేకపోయే సీన్ చాలా బావుంది. మరి ఈ ట్రైలర్ మొత్తం రజినీకాంత్, అక్షయ్ కుమార్ ల వీరంగమే కనబడింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కానివ్వండి.. సినిమాటోగ్రఫీకి కానివ్వండి అబ్బా అదరహా అనకుండా ఉండలేం. మరి ట్రైలర్ కే మైమరిచిపోతే ఎలా... ఈ నెలాఖరున అంటే నవంబర్ 29 సినిమా చూస్తే మరెంతగా విజువల్ ఫీస్ట్ కోసం వెయిట్ చేయండిక..!

2.O Trailer Released:

2.O Trailer Talk Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs