Advertisement
Google Ads BL

‘సవ్యసాచి’ లేటెస్ట్‌ ట్రైలర్‌ దానికోసమేనా..?!


అక్కినేని ఫ్యామిలీ హీరోలైన ఏయన్నార్‌, నాగార్జున, నాగచైతన్యవంటి వారు పలు మాస్‌ చిత్రాలలో నటించినా కూడా ఎక్కువగా క్లాస్‌ చిత్రాల ద్వారానే మంచి ఇమేజ్‌ని, క్రేజ్‌ని తెచ్చుకున్నారు. నాడు ఏయన్నార్‌ తెలుగులో డ్యాన్స్‌లకు, స్టైల్‌కి కొత్త అందం తీసుకుని వచ్చారు. నాడు అమ్మాయిలు ఏయన్నార్‌ వంటి యువకుడిని పెళ్లాడాలని కోరుకునే వారు. ఏయన్నార్‌-వాణిశ్రీల జంట నాడు యూత్‌ని ఐకాన్‌గా నిలిచారు. ఆ తర్వాత నాగార్జున ‘శివ’ నుంచి ‘మాస్‌’ వరకు ఎన్నో మాస్‌ చిత్రాలలో నటించినా కూడా ‘మజ్ను, గీతాంజలి’ వంటి క్లాసిక్‌ చిత్రాల ద్వారా మన్మధునిగా పేరు సంపాదించాడు. ‘సంతోషం, మన్మధుడు’ వంటి చిత్రాలెన్నో ఆణిముత్యాలుగా నిలిచాయి. 

Advertisement
CJ Advs

ఇక నేడు అఖిల్‌ రెండు చిత్రాలను పక్కనపెడితే మాస్‌ హీరోగా పేరు తెచ్చుకోవాలని ‘జోష్‌, ఆటోనగర్‌ సూర్య, తడాఖా, బెజవాడ’ వంటి చిత్రాలతో ఆశించినా చైతూకి కూడా లవర్‌బోయ్‌, ఫ్యామిలీ హీరోగానే మంచి గుర్తింపు వస్తూ ఉంది. ఇక తన ఫ్యామిలీ హీరోల తరహాలోనే నాగచైతన్య కూడా వైవిధ్యభరితమైన చిత్రాలు, లవ్‌స్టోరీలు, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం, శైలజారెడ్డి అల్లుడు’ వంటి చిత్రాల ద్వారా నిరూపించుకుంటున్నాడు. ఆయన చేసిన మరో విభిన్న చిత్రం ‘సవ్యసాచి’ నేడే విడుదల కానుంది. 

ఇప్పటి వరకు ఈ మూవీలోని వైవిధ్యపాయింట్‌ని, లవ్‌, యాక్షన్‌ యాంగిల్స్‌నే పరిచయం చేసిన టీమ్‌ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితూ’ పాట వదలడంతో అక్కినేని ఫ్యామిలీ అభిమానుల్లో సందడి రేపుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌ ఇందులో ఫ్యామిలీ ఆడియన్స్‌ మెచ్చుకునే తరహాలో కామెడీ కూడా ఉందని నిరూపిస్తోంది. కాలేజీలో చైతు, ఆయన ప్రెండ్స్‌ కలిసి ‘సుభద్రా పరిణియం2 నాటకం వేస్తారు. ఆ నాటకంపైనే ఈ ట్రైలర్‌ని కట్‌ చేశారు. 

ఈ నాటకంలో కృష్ణుడిగా కమెడియన్‌ వెన్నెల కిషోర్‌, అర్జునుడుగా నాగచైతన్య, బలరామునిగా హైపర్‌ ఆదిలు కనిపిస్తారు. బలరాముడి పాత్రధారైన హైపర్‌ ఆది ‘మూడు పరీక్షలు గెలిస్తే సుభద్రను పెళ్లి చేసుకోవచ్చు. ఓడిపోతే చెలికత్తె’ను చేసుకోవచ్చు అని పలికిన సెటైర్‌ బాగా పేలింది. ఇలా పౌరాణిక పాత్రల్లో, వేషధారణల హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ చిత్రంలో సగటు ప్రేక్షకుడు మెచ్చే కామెడీకి కూడా ఢోకా ఉండదని ఈ ట్రైలర్‌ నిరూపిస్తోంది. 

Click Here for Video

Savyasachi Subhadra Parinayam Teaser Hilarious:

Savyasachi New Teaser Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs