Advertisement
Google Ads BL

‘మిస్టర్ మజ్ను’కి భలే కష్టం వచ్చిపడింది


అక్కినేని వారసులు అయినా నాగ చైతన్య కెరీర్ తో పాటుగా.. అఖిల్ కెరీర్ కూడా కుదుట పడలేదు. నాగ చైతన్య కెరీర్ లో మంచి హిట్స్ ఉన్నప్పటికీ.. ఇప్పటికి మీడియం రేంజ్ హీరోగా ఉండిపోయాడు. ఇక అఖిల్ భారీగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అఖిల్ తో ఘోరంగా దెబ్బతింటే... పెళ్లి పేరుతో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇక హలో సినిమాతో ఇరుకున పడ్డాడు. రావడం రావడమే స్టార్ హీరో రేంజ్ కలలు కని.. బోర్లా పడిన అఖిల్ మూడో ప్రాజెక్ట్ ని ఆచి తూచి తొలిప్రేమతో తొలి హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే మిస్టర్ మజ్ను సినిమా షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది. రెండు, మూడు పాటల చిత్రీకరణ మాత్రమే బాలన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మిస్టర్ మజ్ను సినిమాని మొదట మేకర్స్ డిసెంబర్ 21 న విడుదల చేస్తామని చెప్పారు. కానీ డిసెంబర్ 21 న శర్వానంద్ పడి పడి లేచే మనసు తో పాటుగా వైఎస్సాఆర్ బయోపిక్ యాత్ర అలాగే హిందీ మూవీ జీరో సినిమాలు వస్తున్నాయి. మరి మిస్టర్ మజ్ను కి ఆ సినిమాలు తట్టుకునే శక్తి లేదని... విడుదల వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం మిస్టర్ మజ్ను యూనిట్ కూల్ గా ఉన్నప్పటికీ... బాగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా చెబుతున్నారు.

ఈ సినిమాని డిసెంబర్ లో కాకపోతే  జనవరి నెలాఖరున విడుదల చేద్దామంటే.. ఎన్టీఆర్ మహానాయకుడు, మణికర్ణిక వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. మరి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మిస్టర్ మజ్ను ఫిబ్రవరి విడుదల అంటే బాగా లేట్ అవుతుందని అంటున్నారట. మరి మిస్టర్ మజ్ను విడుదల డేట్ ని ఫిక్స్ చెయ్యడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందంటున్నారు. ఇప్పటికే నాగ చైతన్య సవ్యసాచి కూడా విడుదల పోస్ట్ పోన్ అవుతూ ఆఖరుకి సర్కార్ కి థగ్స్ అఫ్ హిందూస్తాన్ కి దొరికిపోయినట్లుగా అఖిల్ మిస్టర్ మజ్ను కూడా ఇరుక్కుంటుందేమో అనే భయంలో ఉన్నారట. చూద్దాం అఖిల్ కూల్ గా ఎప్పుడు దిగుతాడా అనేది..?

Mr Majnu Release Postponed:

Release date Problem to Mr Majnu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs