Advertisement
Google Ads BL

‘ఎన్టీఆర్’లో దాసరిగా చేయనన్నాడంట!


క్రిష్ డైరెక్షన్‌లో బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్‌లో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే కథానాయకుడు సినిమా షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేసిందని టాక్ నడుస్తుంది. ఈ కథానాయకుడు సినిమాలో అనేకమంది నటీనటులు గెస్ట్ పాత్రలలో మెరవబోతున్నారు. ఇప్పటికే రానా, రకుల్ ప్రీత్, డాక్టర్ భరత్, విద్యాబాలన్, సుమంత్ వంటి నటీనటులు ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహిత పాత్రల్లో నటించారు. అలాగే ఎన్టీఆర్ తో సంబంధమున్న కొంతమంది డైరెక్టర్స్ పాత్రలను కూడా టాలీవుడ్ లోని కొంతమంది డైరెక్టర్స్ పోషిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇప్పటికే దర్శకుడు దేవి ప్రసాద్ గుమ్మడిగా.... క్రిష్ కేవీ రెడ్డిగా నటిస్తున్నారు. అయితే దర్శకుడు ఎన్ శంకర్ కూడా విఠలాచార్య పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం ఉంది. తాజాగా ఎన్టీఆర్ కి సన్నిహితుడిగా.. ఎన్టీఆర్ తో అనేక సినిమాలు డైరెక్ట్ చేసిన దాసరి నారాయణరావు గా ఎన్టీఆర్ కథానాయకుడిలో ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ప్రస్తుతం చాలామంది దర్శకులను క్రిష్ ఈ సినిమాలో భాగస్వామ్యులను చేస్తున్నాడు. అయితే దాసరి పాత్రను చేసేందుకు వినాయక్ అంగీకరించలేదని, అందుకే చిత్రంలో దాసరి పాత్ర లేకుండానే తెరకెక్కించాలని క్రిష్ నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే మాత్రం.. మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సిందే. 

ప్రస్తుతం కథానాయకుడు షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా మహానాయకుడు పార్ట్ షూటింగ్ ని కూడా ఎప్పుడో మొదలెట్టేసిందని తెలుస్తుంది. ఇక మహానాయకుడు లోని పాత్రలను కూడా మెల్లగా బయటపెట్టడానికి క్రిష్ అండ్ బాలయ్యలు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. కథానాయకుడు జనవరి తొమ్మిదిన, మహానాయకుడు సినిమా జనవరి 24 న విడుదలకు మేకర్స్ డేట్స్ ఫిక్స్ చేశారు.

Top Director Bluntly Rejects NTR!:

VV Vinayak Turns Down NTR!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs