'మీటు' ఉద్యమంలో నిజాయితీ ఉండవచ్చుగానీ దానిని కూడా బ్లాక్‌మెయిలింగ్‌కి, కక్ష్యసాధింపు చర్యలకు ఉపయోగిస్తుంటే పరిస్థితి ఏమిటి? అనే చర్చరావడం సహజం, నిజానికి ప్రతి విషయానికి బొమ్మాబొరుసు ఉన్నట్లే దీనికి కూడా ఉంటాయనేది వాస్తవం. తాజాగా ఓ నటి, మోడల్ చేసిన చెత్త పని, దానికి ఆమె చేసిన బెదిరింపులు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ముంబై మోడల్ అయిన మేఘాశర్మ ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈమె మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేయడమే కాదు.. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులను ఆమె బెదిరించిన విధానం చూస్తే ఇలాంటి వారి వల్లే మిగిలిన నటీమణులకు కూడా చెడ్డ పేరు వస్తోందనేది అవగతం అవుతోంది. తనని నియంత్రించడానికి పోలీసులు రావడంతో ఆమె సహనం కోల్పోయి ఒంటి మీద ఉన్న బట్టలను తీసి వేయడంతో ఖంగుతిన్న పోలీసులు అక్కడి నుంచి పారిపోవడం గమనార్హం.
ఈ సంఘటన ముంబైలో జరిగింది. మేఘాశర్మ అనే మోడల్ ముంబైలోని ఖండ్వాలాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటోంది. అయితే అర్ధరాత్రి పూట అపార్ట్‌మెంట్‌కి ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వద్దకు వెళ్లి సిగరెట్లు తెచ్చివ్వాలని కోరింది. కానీ అప్పటికే సమయం అర్దరాత్రి 2 గంటలు కావడంతో సెక్యూరిటీ గార్డ్ దానికి నిరాకరించాడు. దాంతో ఊగిపోయిన మేఘాశర్మ ఆ సెక్యూరిటీ గార్డ్‌పై చేయి చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో గొడవ జరుగుతున్న నేపధ్యంలో లోకల్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వాళ్లకి ఆమె సెక్యూరిటీ గార్డ్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి ఈ విషయాన్ని స్టేషన్‌కు వచ్చి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలని కోరారు.
దాంతో మేఘాశర్మకి ఎక్కడ లేని కోపం వచ్చింది. అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాలని ఆమె ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆమె ఒంటి మీద ఉన్న బట్టలను తొలగించింది. దాంతో బిత్తరపోయిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై స్పందించిన మేఘాశర్మ అర్ధరాత్రి 3గంటల సమయంలో ఒక్క లేడీ కానిస్టేబుల్ లేకుండా వచ్చి తనని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లబోయారని, దాంతోనే తాను తన బట్టలన్నీ విప్పేశానని సెలవిచ్చింది. మేఘాశర్మ చేసిన తతంగం మొత్తం సిసి కెమెరాలలో రికార్డు కావడంతో ఇది ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.