Advertisement
Google Ads BL

ప్రేమా లేదు.. దోమా లేదు: హీరోయిన్!


కోలీవుడ్‌లో మన తెలుగు కుర్రాడు విశాల్‌కి మంచి స్టార్‌గా పేరుంది. ఇక ఈయన నడిగర్‌ సంఘం, నిర్మాతల మండలిలో కూడా కీలకపాత్రలను పోషిస్తున్నాడు. నడిగర్‌ సంఘానికి సొంత బిల్డింగ్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టి, అందులోని కళ్యాణమండపం నిర్మించిన తర్వాత అందులో మొదటి పెళ్లి తనదే అవుతుందని నాడు మాట ఇచ్చాడు. ఇక విశాల్‌కి శరత్‌కుమార్‌ కూతురు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తో ప్రేమ ఉందని, ఈ కారణంగానే విశాల్‌కి శరత్‌కుమార్‌-రాధిక దంపతులకు గొడవలు వచ్చాయని కోలీవుడ్‌ మీడియా చెప్పేది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాత్రం విశాల్‌తో తనకు ప్రేమ లేదని తేల్చిచెప్పింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు చెబుతాను. విశాల్‌తో నాకున్నది ప్రేమ బంధం కాదు. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. ఆయన నేను మా భావాలను ఒకరితో ఒకరం పంచుకుంటూ ఉంటాం. అంత మాత్రాన ప్రేమ, పెళ్లి అనడం సరికాదు. మూడేళ్ల తర్వాత నేను దర్శకత్వం చేస్తాను. ఐదేళ్ల తర్వాత రాజకీయాలలోకి వెళ్లాలని ఉంది. నా తండ్రితో కలసి పని చేస్తానని చెప్పలేను. ఎందుకంటే నా వ్యక్తిత్వం వేరు. నేను ఎన్నో చిత్రాలలో నటించినా కూడా నా తండ్రితో కలిసి ఇప్పటి వరకు నటించలేదు. ఇప్పుడు ఆయనతో కలసి ఓ చిత్రంలో నటిస్తున్నాను. అందులో నేను పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాను. మహిళలపై వేధింపులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ 'మీటూ' ఉద్యమం ద్వారా దానిపై అవగాహన వచ్చింది. తప్పుడు ఆరోపణలతో దీనిని దుర్వినియోగం చేయకూడదు. 

తమిళం, కన్నడ, మలయాళంలో విభిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. 22 సినిమాలలో నటించాను. తొలిసారి నేను తెలుగులో చేసిన చిత్రం 'పందెం కోడి 2'. ఇందులో ప్రతినాయకురాలిగా కనిపించాను. మంచి పేరు వచ్చింది. విజయ్‌తో కలిసి నటించిన 'సర్కార్‌' చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఇది పొలిటికల్‌ థ్రిల్లర్‌. ఇందులో ప్రజలకు ఓటు హక్కు గురించి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ చిత్రంలోని పాత్రకు నేనే తెలుగులో స్వయంగా డబ్బింగ్‌ చెప్పాను. నేనెప్పుడు నేను నటించిన చిత్రాలను ముందుగా చూడను. విడుదల తర్వాత నేరుగా థియేటర్‌లో చూస్తాను. కానీ ఈ చిత్రంలోని నా పాత్ర వరకు చూశాను. బాగా నచ్చింది. ఇది సవాల్‌తో కూడుకున్న పాత్ర అని చెప్పింది. కాగా 'సర్కార్‌' చిత్రం దీపావళి కానుకగా 6వ తేదీన విడుదల కానుంది. 

Heroine About Love Marriage:

Varalakshmi Sarath Kumar Latest Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs