Advertisement
Google Ads BL

నవంబర్‌ 3నే ‘2.0’ సెన్సేషన్..!!


నవంబర్‌ 29న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ల 3డి చిత్రం ‘2.0’ 

Advertisement
CJ Advs

నవంబర్‌ 3న ట్రైలర్‌ రిలీజ్‌ 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 3డి చిత్రం ‘2.0’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్‌ మరియు కరణ్‌ జోహర్‌ సమర్పణలో సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, నవంబర్‌ 3న ఈ చిత్రం ట్రైలర్‌ను చెన్నైలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా, ఎడిటింగ్‌: ఆంటోని, నిర్మాణం: సుభాష్‌ కరణ్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

2.0 Trailer Release Date Out:

2.0 Trailer Release on Nov 3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs