Advertisement
Google Ads BL

బాహుబలి కాదు రంగస్థలమే కావాలంట..!!


రంగస్థలం సినిమా వచ్చేవరకు టాలీవుడ్ హీరోలంతా రాజమౌళి బాహుబలి లాంటి సినిమా చెయ్యాలని దర్శకనిర్మాతల మీద ఒత్తిడి తెచ్చేవారు. బాహుబలి లాంటి కళాఖండంలో నటించి సూపర్ హీరోస్ అవ్వాలని కలలు కనేవారు. ఇక సుకుమార్.. రామ్ చరణ్ తో రంగస్థలం లాంటి భారీ హిట్ సినిమా తీసేసరికి... ఇప్పుడు బాహుబలిని వదిలేసి రంగస్థలం లాంటి సినిమా కథ కావాలంటూ పట్టుబడుతున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా వరకు సాధారణ టాప్ డైరెక్టర్ గా కొనసాగిన సుకుమార్ రంగస్థలం హిట్ తో రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ సరసన చోటు సంపాదించుకున్నాడు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం మహేష్ కోసం కథతో కుస్తీ పడుతున్న ఈ దర్శకుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రంగస్థలం లాంటి హిట్ కొట్టాలనే కసితోనే ఉంటాడు. కానీ హీరోలకే నమ్మకం కలగడం లేదు. ప్రస్తుతం మహేష్ కోసం రెడీ చేసిన కథ మహేష్ కి నచ్చలేదని ప్రచారం జరుగుతుంది. సుక్కు చెప్పిన కథతో మహేష్ సంతృప్తి చెందలేదని.. మరో కథను రెడీ చెయ్యమని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక మహేష్ కోసం కథను రెడీ చేసే పనిలో ఉన్న సుకుమార్ ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి డార్లింగ్ ప్రభాస్ కి చేయబోతున్నాడట. ప్రస్తుతం సాహో, జిల్ రాధాకృష్ణ సినిమాల్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తానని చెప్పాడట.

గతంలోనే ప్రభాస్ - సుకుమార్ కాంబోలో సినిమా రావాల్సింది. కానీ కుదరలేదు. కానీ ఇంతవరకు వారి కాంబోలో మూవీ రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ - ప్రభాస్ మూవీ పక్కాగా ఉంటుందని.. ప్రభాస్ కి రంగస్థలం బాగా నచ్చడంతో అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో మంచి కమర్షియల్‌ కథ రెడీ చేయమని సుకుమార్ కి సూచించాడట. మరి రంగస్థలం హిట్ తర్వాత సుకుమార్ రెడీ చేసే కథలన్నీ రంగస్థలం రేంజ్లో ఉండాలనే హీరోలంతా భావిస్తున్నారు. కాబట్టే మహేష్ కి సుక్కు చెప్పిన కథ లో డౌట్స్ ఉన్నాయి. ఇక తాజాగా ప్రభాస్ కూడా రంగస్థలం లాంటి కథే కోరుకుంటున్నాడు. కాకపోతే మహేష్ తో మూవీ తర్వాత సుక్కుకు.. ప్రభాస్ తోనే సినిమా వుండబోతుందనేది మాత్రం నిజమంటున్నారు.

Sukumar’s Films with Mahesh Babu and Prabhas!:

Sukumar’s Films with Two Crazy Heroes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs