Advertisement
Google Ads BL

టాక్సీవాలా కూడా గీతగోవిందం దారిలోనే..


గీత గోవిందం చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలే.... అనే పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడిదే ఊపును ప్రదర్శిస్తోంది మరో పాట. ‘మాటే వినదుగా’....... అంటూ సాగే ఈ పాట టాక్సీవాలా చిత్రంలోనిది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్న టాక్సీవాలా చిత్రంలోని మాటే వినదుగా అనే పాట 2 మిలియన్ వ్యూస్ సంపాదించేందుకు ఏంతో టైం పట్టలేదు. ముఖ్యంగా ఈ పాటలోని మెలోడీ టచ్ మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సిడ్ శ్రీరామ్ తన గొంతుతో మరోసారి మ్యాజిక్ చేశాడు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. జేక్స్ అద్భుతమైన రొమాంటిక్ మెలోడిసాంగ్ అందించాడు. ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్  చేస్తున్న ఈ పాట సినిమాలో కీలకమైంది. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా....రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్  వర్క్ శరవేగంగా జ‌రుపుకుంటోంది. నవంబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ... విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాము. విజ‌య్ ఇమేజ్ కి  తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మేనరిజమ్స్ యూత్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. గీత గోవిందం వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఏర్పడిన అంచనాలను దృష్టిలో ఉంచుకొని టాక్సీవాలాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రం లో హైలైట్ గా నిలుస్తాయి. ఇటీవలే విడుదల చేసిన మాటే వినదుగా అనే సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాదాపు 2 మిలియన్ వ్యూస్ సాధించేందుకు మరో అడుగు దూరంలోనే ఉంది. సిడ్ శ్రీరామ్ తన గొంతుతో మెస్మరైజ్ చేశాడు.  స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చాలా కీలకం. బెటర్ క్వాలిటీ గ్రాఫిక్స్ కోసమే ఈ చిత్రం విడుదల కాస్త ఆలస్యమైంది. జీఏ2 పిక్చర్స్ , యు.వి క్రియేషన్స్ క్వాలిటీ విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కావనే విషయం తెలిసిందే. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ  చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. అని అన్నారు. 

నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు

సాంకేతిక వర్గం:

పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచర్ల

పిఆర్ఓ - ఏలూరు శ్రీను

సౌండ్ - సింక్ సినిమా

స్టంట్స్ - జాషువా

ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి

లిరిక్స్ - కృష్ణ కాంత్

మ్యూజిక్ - జేక్స్ బిజాయ్

ఎడిటర్, కలరిస్ట్ - శ్రీజిత్ సారంగ్

సినిమాటోగ్రాఫర్ - సుజిత్ సారంగ్

స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - సాయి కుమార్ రెడ్డి

నిర్మాత - ఎస్ కె ఎన్ (SKN)

ప్రొడక్షన్ హౌజ్ - జీఏ 2 పిక్చర్స్ మరియు యువి క్రియేషన్స్ 

స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంకృత్యాన్

Taxiwala Song is getting Superb Response:

Vijay Devarakonda who earned immense craze with his youthful entertainers is now preparing for his next release TaxiWala.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs