Advertisement
Google Ads BL

రకుల్‌ డ్రస్‌పై ఆడేసుకున్నారు..!!


తెలుగులో అతి తక్కువ చిత్రాలతోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌. తన సహచర నటీమణులైన రెజీనా, రాశిఖన్నా వంటి ఎందరికంటేనో వేగంగా ఎదిగి టాలీవుడ్‌లోని యంగ్‌స్టార్స్‌ అందరితో ఓ రౌండు వేసింది. కానీ ఆ తర్వాత ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది. అతి తక్కువ కాలం మాత్రమే స్టార్‌ హోదా వెలగబెట్టిన ఈమెకి ప్రస్తుతం 'వెంకీమామా' అనే చిత్రంలో మాత్రమే అవకాశం ఉంది. దాంతో ఈ అమ్మడు కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం సూర్య, అతని సోదరుడు కార్తిలతోపాటు కొన్ని తమిళ చిత్రాలలో నటిస్తోంది. ఈమె ప్రభావం 'స్పైడర్‌, జయజానకి నాయకా' వంటి చిత్రాలతో మసకబారింది. 

Advertisement
CJ Advs

ఇక ఈమధ్య ఈమె సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. 'మనలోని చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఎప్పటికీ అలాగే ఉండిపోనివ్వాలి' అని చెబుతూ ఓ అల్ట్రామోడ్రన్‌ డ్రస్‌తో ఉన్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ డ్రస్‌ చూసేందుకే వెగటు పుట్టించేలా ఉంది. అంటే ఆమె దృష్టిలో చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఇలాంటి డ్రస్‌లు వేసుకోవడమా? పిల్లల లాగా బట్టలే వేసుకోకపోవడమా? లేక వారిలోని కల్లాకపటం తెలియని మనస్తత్వమా? ఏది ఆమె దృష్టిలో చిన్నపిల్లల మనస్తత్వం అంటే అనే అనుమానం రాకమానదు. 

ఈ ఫోటోపై నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. వారు ఆమెని ఓ ఆటాడేసుకుంటున్నారు. నీ జాకెట్‌ పరమచెత్తగా ఉంది.. బిచ్చగాళ్లే నయం ఇంతకంటే మంచి డ్రస్‌లు వేసుకుంటారు. సినిమా అవకాశాలు లేక, డబ్బులు లేక రోడ్డు పక్కన అమ్మే దుస్తులను వేసుకుంటున్నావా? నా దగ్గరకు రా.. నేను కొనిస్తా.. అని పలువురు ఆమెపై ముప్పెట దాడి చేస్తుండటం గమనార్హం. ఇలాంటి తలాతోకా లేని విషయాల ద్వారా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరికి దగ్గర కావాలనుకున్న రకుల్‌ ప్లాన్‌ బెడిసి కొట్టినట్టేనని దీని ద్వారా అయినా ఆమె గుర్తిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!

Netizens Comments on Rakul preet Singh Dress:

Rakul Preet Dress irritates Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs