Advertisement
Google Ads BL

‘సర్కార్’.. ఇలా కాంప్రమైజ్ అయ్యారు!


మురుగదాస్ - విజయ్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సర్కార్ సినిమా ఈ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా ఒక వివాదంలో చిక్కుకుంది. విజయ్ - మురుగదాస్ కలయికలో తెరకెక్కిన సర్కార్ సినిమా కథ తనదే అంటూ రైటర్ వరుణ్ రాజేంద్రన్ హైకోర్టుకి ఎక్కాడు. తాను గత కొన్నేళ్ల క్రితమే సెంగోల్ పేరుతో ఈ సర్కార్ కథ  రెడీ చేశానని.... కానీ అదే కథను మురుగదాస్ కాపీ కొట్టి సర్కార్ సినిమాని తెరకెక్కించాడని... దీనికి పరిహారంగా 30 లక్షలు డిమాండ్ చెయ్యడమే కాదు.. సర్కార్ మూవీ కథలో తనకి క్రెడిట్ కావాలంటూ కూర్చున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఈ విషయం కోర్టుకెళ్లడంతో.. చాలా రోజులు మురుగదాస్ మౌనంగానే ఉన్నాడు. వరుణ్ చెప్పింది ఒప్పుకుంటే... తన సినిమా కథ కాపీ అని తేలిపోయి పరువు పోతుందన్న భయంతో మురుగదాస్ మధ్యలో అనేక కథలు చెప్పాడు. కానీ సినిమా విడుదల సమయం దగ్గర పడ్డాక కోర్టులో హియరింగ్ కి వచ్చిన ఈ కేసు విషయంలో మురుగదాస్ తాజాగా రాజీకి వచ్చాడు. గొడవలెందుకు అనుకున్నాడో ఏమో... సర్కార్ సినిమా స్టోరీ విషయంలో కేసు పెట్టిన రైటర్ వరుణ్ రాజేంద్రన్ కి 30 లక్షలు ఇవ్వడానికి మాత్రమే కాదు...  టైటిల్స్‌లో రైటర్ వరుణ్ రాజేంద్రన్ పేరు వేయటానికి కూడా మురుగదాస్ అంగీకరించాడు. ఇక సమస్య ఒక కొలిక్కి రావడంతో.. నవంబర్ 6 న ఈ సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి.

Murugadoss compromised For Sarkar Release:

Sarkar controversy Ended
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs