Advertisement
Google Ads BL

మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదేమో..?


ఈ ఏడాది చివరిలో రిలీజ్ అవుతున్న భారీ చిత్రం  ‘2.0’. ఎప్పుడో రిలీజ్ రావాల్సిన ఈ సినిమా హెవీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా వాయిదా పడుతూ నవంబర్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. రజిని - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఇండియా వెయిట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరో రెండు రోజుల్లో ట్రైలర్ కూడా రాబోతుంది.

Advertisement
CJ Advs

ఈసారి ఎట్టి పరిస్థితిల్లో సినిమా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు మేకర్స్. రీసెంట్ గా మేకింగ్ వీడియో ఒకటి వదిలారు. ఇందులో కొన్ని షాట్లు అద్భుతంగా అనిపిస్తున్నాయి. సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక తమిళనాడులో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్.. నిర్మాతలు పత్రికా ప్రకటనలు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. చెన్నైలో రిలీజ్ అయ్యే థియేటర్లతో లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టారు మేకర్స్.

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్.. బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అనడంతో పాటు ‘ది బిగ్టెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2018’ అని కూడా ఆ పోస్టర్ మీద ప్రకటించేశారు. అంటే సినిమా మీద మేకర్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాలి. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తరువాత రిజల్ట్ బట్టి పోస్టర్స్ వేస్తుంటారు కానీ లైకా వారు ముందే ఇలా వేసుకోవడం కరెక్ట్ కాదు. ముందే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2018 అని వేసుకోవడం మాత్రం కొంచెం టూమచ్ అనే చెప్పాలి. మరి నిర్మాతలు చెప్పినట్టు ఈ సినిమా నిజంగానే బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ నెగటివ్ టాక్ వస్తే ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ ఒక రేంజ్ లో వస్తాయి.

Makers Over Confidence on 2.0 Movie:

2.0 Makers Over action Revealed with Posters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs