Advertisement
Google Ads BL

పోస్ట్ పెడుతుంది.. పెళ్లంటే మాట్లాడదు..?


ప్రస్తుతం టాలీవుడ్‌ మాత్రమే కాదు.. అందరూ ఎదురు చూస్తోన్న ముగ్గురి వివాహ విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త చర్చలకు తావిస్తూనే ఉన్నాయి. వారే ప్రభాస్‌, అనుష్క, నయనతార. ఇక స్వీటీ అనుష్క విషయానికి వస్తే ఆమె కొత్తగా చేసే చిత్రాల కంటే ఆమె వివాహ వార్త వినాలని ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆమె తనకి సంబంధించిన ఏ కొత్త విషయం చెబుతానని చెప్పినా, అది ఆమె పెళ్లి వార్తేనని అందరు తెగ ఇదైపోతున్నారు. కానీ ఆమె మాత్రం ఏమాత్రం ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా తనదైన శైలిలో ఈ ప్రశ్నకు మాత్రం జవాబును దాటవేస్తునే ఉంది. 

Advertisement
CJ Advs

తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో.. దానికి ఆమె ‘నో క్యాప్షన్‌ రిక్వైర్డ్‌’ అని అంటూ చేసిన పోస్ట్‌కి కూడా ఇది ఆమె వివాహం గురించిన విషయమేనని కామెంట్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే దీనికి లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇంతకీ ఆమె ఏ ఫొటో పోస్ట్‌ చేసిందంటే.. రోడ్డు పక్కనే ఉన్న గడ్డి, పిచ్చి మొక్కల మద్య ఆమె ఎడమపాదం ఉంచిన ఫొటో అది. ఆ ఫొటోలో ఓ ఆకు ఆమె వేలికి మెట్టెలాగా చుట్టుకుని ఉంది. దీంతో అనుష్క పెళ్లి వార్త చెబుతారేమోనని నెటిజన్లు కుతూహలాన్ని ప్రదర్శించారు. ‘ఇంతకీ పెళ్లెప్పుడు? త్వరలోనే పెళ్లి వార్త చెప్పబోతున్నారా? ఈ నవంబర్‌లో మీ పుట్టినరోజున ఈ శుభవార్తని వినవచ్చా?’ అంటూ ఆమెను పెళ్లికి సంబంధించిన చాలా ప్రశ్నలే అడిగారు. అయితే వాటికి అనుష్క స్పందించలేదు. వెంటనే ఎండుటాకుల మధ్య పూసిన పసుపు పచ్చటి పువ్వు ఉన్న ఫొటోను షేర్‌ చేసి ‘కళ్లు చూడగలిగిన అందాన్ని పదిలపరిచేది ఫొటోలే.. ప్రకృతి’ అని రాసింది. దీన్ని బట్టి ఆమె ప్రకృతిని ఆస్వాదిస్తూ, తన కవి హృదయాన్ని తెలుపుతూ దానిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫొటోలను షేర్‌ చేసినట్లు అర్ధమవుతోంది. మరోవైపు ఈమె ప్రస్తుతం బాగా బరువు తగ్గే పనిలో ఉంది. ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’లో ఆమె అతిధి పాత్రలో మెరుస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఆమె పుట్టినరోజు కానుకగా ఆమె ఏ విషయమైనా నోరు విప్పుతుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Anushka posted Photo Sensation in Social media:

Anushka Shared photo Signels to Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs