Advertisement
Google Ads BL

హిట్ కొట్టిందా.. ఇక పట్టుకోలేరంతే..!!


బాలీవుడ్ అందాలు తెలుగు తెర మీద కొత్తేమి కాదు. ఒకప్పుడు వెంకటేష్ సరసన బాలీవుడ్ భామలు చాలామంది జోడి కట్టారు. ఈ ఏడాది భరత్ అనే నేను తో కియారా అద్వానీ టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కాక ముందే రామ్ చరణ్ సరసన బోయపాటి సినిమాలో ఛాన్స్ పట్టేసింది. తాజాగా మరో బాలీవుడ్ భామ తొలి సినిమాతోనే హిట్ కొట్టాలని చూస్తుంది. ఎప్పుడూ హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోస్ లో నిధి అగర్వాల్ కుర్ర కారుని కైపెక్కిస్తుంది. సోషల్ మీడియాలో గ్లామర్ గేట్లు తెరిచి పిచ్చెక్కించే నిధి అగర్వాల్.. నాగ చైతన్యతో కలిసి చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి చిత్రంలో నటించింది. గ్లామర్ భామగా మీడియాకి పరిచయమున్న ఈ భామ సవ్యసాచిలో ఎలాంటి గ్లామర్ తో పడేస్తుందో తెలియదు కానీ.. ఈ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఇక్కడే జెండా పాతాలని చూస్తుంది.

Advertisement
CJ Advs

అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాట పడని ఈ భామ సవ్యసాచి సినిమాలో ఎలా వుండబోతుందో అనే ఆసక్తి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. మంచి అంచనాలున్న సవ్యసాచి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ చైతన్య మాస్ యాక్షన్, చందూ డైరెక్షన్ స్కిల్స్... అన్నిటికన్నా ముఖ్యంగా తమిళ హీరో మాధవన్ ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేయడమనే ఆసక్తికర అంశాలు ఈ సవ్యసాచిలో కనబడుతున్నాయి. 

మరి నిధి తన నిధిని ఎలా చూపించబోతుందో అనేది మరో రెండు రోజుల్లోనే తెలిసిపోతుంది. అయినా మొదటి సినిమా ఫలితం రాకుండానే మరో అక్కినేని హీరో అఖిల్ పిలిచి మరీ నిధి అగర్వాల్ కి మిస్టర్ మజ్నులో అవకాశమిచ్చాడు. ఒకవేళ సవ్యసాచి హిట్ అయితే గనక అమ్మడు అదృష్టం మాములుగా ఉండదు. అందుకే సవ్యసాచితో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తుంది. మరి నిధి అగర్వాల్ అనుకున్న హిట్ సవ్యసాచితో వస్తుందోలేదో చూడాలి.

Heroine Nidhi Agarwal Waiting for SavyaSachi Result:

Nidhi Agarwal Full Confidence on Savyasachi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs