Advertisement
Google Ads BL

‘గజని’ లాంటిదేగా ‘భలే భలే మగాడివోయ్’: చందూ


డైరెక్టర్ చందూ మొండేటి - నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. ‘ప్రేమమ్’ తరువాత మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. నవంబర్ 2న వరల్డ్ వైడ్ గా ఈసినిమా రిలీజ్ అవ్వబోతోంది. టీజర్, ట్రైలర్ బట్టి ఈసినిమా కథ ఏంటో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ‘వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌’ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈసినిమాలో అదొక్కటే పాయింట్ కాదని డైరెక్టర్ చందూ మొండేటి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

Advertisement
CJ Advs

ఇందులో చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయని.. తన స్నేహితుడు ‘వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌’ కాన్సెప్ట్‌ గురించి చెబితే విన్నాననీ, తరవాత కథలో పెట్టానని ఆయన చెప్పారు. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ అండ్ కామెడీ తో సరదాగా సాగిపోతుందని సెకండాఫ్ అసలు కథ మొదలు అవుతుందని తరువాత ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ వుంటాయని చందూ మొండేటి చెప్పారు. కన్నడలో జూన్ లో రిలీజ్ అయిన ‘సంకష్ట కర గణపతి’ అనే సినిమా కాన్సెప్ట్ మీ సినిమా కాన్సెప్ట్ ఒకేలా ఉందని ప్రశ్నించగా... ఆ సినిమా 2 నెలలు కిందట రిలీజ్ అయింది. మా సినిమా ఎప్పుడో మొదలైంది.

అయినా ఒకే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు రావొచ్చు అందులో తప్పు ఏమి ఉంది. ఉదాహరణకు…మతిమరుపు మీద ‘గజని’ వచ్చింది. తరువాత ‘భలే భలే మగాడివోయ్‌’ కూడా వచ్చింది కదా! అలా ఒక్క కాన్సెప్ట్ మీద ఎన్ని సినిమాలైనా రావొచ్చు. ఇది కూడా అంతే అని చందూ అన్నారు. చిన్న సినిమాగా తీయాలనుకున్న తనకు మైత్రి మూవీస్ వారి సహకారంతో పెద్ద సినిమాగా మారిందని అన్నారు.

Chandoo Mondeti Clarity on Savyasachi:

Chandoo Mondeti Latest Interview about Savyasachi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs