ప్రస్తుతం ఉన్న స్టార్స్‌లో కోలీవుడ్‌కి చెందిన అజిత్‌కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక కోలీవుడ్ స్టార్స్ మొదటి నుంచి అభిమానుల విషయంలో గొప్పగా స్పందిస్తూ ఉంటారు. తన అభిమాని ఓ యాక్సిడెంట్‌లో మరణిస్తే హీరో కార్తి వెక్కివెక్కి ఏడ్చాడు. సూర్య అభిమానులు తనకి పాదాభివందనం చేయబోతే తిరిగి ఆయనే వారికి పాదాలను తాకాడు. ఇక లారెన్స్, విజయ్‌ల నుంచి రజనీకాంత్ వరకు, ఇలా అందరు తమ అభిమానుల విషయంలో ఫ్యాన్సే తమ దేవుళ్లు అనే విషయాన్ని మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపిస్తూ ఉంటారు. ఓ సినిమా సక్సెస్‌ర్యాలీలో తన అభిమాని హెల్మెట్ పెట్టుకోకపోవడం, కొద్దిగా ప్రమాదం తప్పడంతో సూర్య అభిమానులను ఈ విషయంలో హెచ్చరించాడు.
ఇక తాజాగా అజిత్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇప్పటికే బ్యానర్లు పెట్టడం, కటౌట్లు, పాలాభిషేకాలే కాదు.. ఏకంగా అభిమాన సంఘాలను కూడా వద్దని ఆయన తన మనోభావం చాటాడు. ఇప్పుడు మరో సంఘటన ఆయన పెద్దమనసుకి ఉదాహరణగా నిలుస్తుంది. ప్రస్తుతం అజిత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో ‘విశ్వాసం’ చిత్రం రూపొందుతోంది. ‘వీరం, వేదాళం, వివేగం’ల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో చిత్రం ఇది. ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఓ రాత్రంతా ఆయన నిద్ర లేకుండా డబ్బింగ్ చెప్పాడు. దీంతో డబ్బింగ్ స్టూడియోలో అజిత్ ఉన్నాడని తెలిసి ఆయనను కలిసేందుకు అభిమానులు భారీగా చేరారు.
ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియా ద్వారా తెలుసుకున్న అజిత్ స్టూడియో బయటకు వచ్చి అభిమానులను హెచ్చరించాడు. నాకోసం నిద్ర లేకుండా రాత్రంతా వేచిచూసి విలువైన సమయం వృధా చేయడం తప్పు. ఇంకెప్పుడు అలా చేయవద్దు. కుటుంబసభ్యులతో వీలైనంత సమయం గడపాలి... అని వారికి చెప్పి వారితో సెల్ఫీలు దిగి, ఇంకెప్పుడు అలా చేయమని చెప్పి వారి వద్ద ప్రమాణం చేయించుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది.