Advertisement

మగాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తేనే: శోభన!!


‘రుద్రవీణ’ చిత్రంలో ‘లలిత ప్రియ కమలం.. ’ పాటలో క్లాసిక్‌ టచ్‌ ఉంటుంది. ఇక ఇందులో రొమాంటిక్‌ సాంగ్స్‌ కూడా ఉన్నాయి. వీటిల్లో దేనికి ఎంజాయ్‌ చేశారు.. అనే ప్రశ్నను తాజాగా నటి శోభనకు వేస్తే ఆమె సమాధానం ఇస్తూ.. ‘ఇదే ఇష్టం’ అని కట్టుబాటు పెట్టుకుంటే కళకు న్యాయం జరగదు. ఏదైనా కళే కదా...! మన సామర్ధ్యం మేరకు ఇచ్చిన బాధ్యతలను బాగా చేస్తున్నామా? లేదా? అనేదే ముఖ్యం. క్లాసిక్‌, రొమాంటిక్‌ సాంగ్స్‌ అంటూ ఉండవు. ఉండేదల్లా కాన్సెప్ట్‌ మాత్రమే. ఆ కాన్సెప్ట్‌కి న్యాయం జరగాలంటే కేవలం నటీనటులు మాత్రమే సరిపోరు. డైరెక్టర్‌, కెమెరామెన్‌ బాగా క్యాప్చర్‌ చేయాలి. 

Advertisement

క్లాసిక్స్‌ ఇష్టపడే వారికి మాస్‌ కూడా నచ్చుతుంది. క్లాస్‌ అయినా మాస్‌ అయినా రెండు మ్యూజిక్కే కదా..! అందుకని మాస్‌ సాంగ్స్‌ని వేరు చేసి చూడలేం. మలయాళంలో ‘మణిచిత్రతాళ్‌’, తెలుగులో ‘రుద్రవీణ’ వంటి ఎన్నో మంచి చిత్రాలు చేశాను. మనం మాత్రమే బాగుండి.. మనం బాగా చేస్తే చాలదు. సినిమాలు బాగుండాలి అదృష్టవశాత్తు అలాంటి చిత్రాలెన్నో చేశాను. డ్యాన్స్‌ అనేది కూడా ఫిజికల్‌ ఆర్టే. పాతికేళ్ల వయసులో చెంగు చెంగున దూకుతూ డ్యాన్స్‌ చేసినట్లు 50ఏళ్ల వయసులో కూడా చేయగలిగితే గ్రేటే. కానీ అది అసాధ్యం. కానీ ప్రేక్షకులు ఆ పెర్ఫార్మెన్స్‌కి అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి అదే గ్రేస్‌ ఉండాలని ఆశిస్తారు. అది తప్పు కూడా కాదు. ఆర్టిస్టులు కూడా నిరంతరం ప్రేక్షకులను శాటిస్‌ఫై చేయడానికి బాగా కృషి చేస్తూనే ఉంటారు. 

డ్యాన్స్‌అనేది ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ కూడా. ఈ వయసులో కూడా నేను ఇలా ఫిజిక్కును మెయిన్‌టెయిన్‌ చేయడానికి అదే కారణం అయి ఉండవచ్చు. దానితో పాటు మనం ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనేదానితో పాటు మైండ్‌ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేను ఇలా చేస్తున్నానని చెబితే అది పక్కవారి శరీరతత్వానికిసరిపడకపోవచ్చు. ముందు మన శరీరతత్వాన్ని మనం గుర్తించాలి. ఎలా తినాలి? ఎంత సేపు ఎక్సర్‌సైజ్‌లు చేయాలి? అనేది నిర్ణయించుకోవాలి. అతిగా తినకూడదు. ఆయిల్‌ ఫుడ్‌ తీసుకోకూడదు. పంచదార తియ్యగానే ఉంటుంది. కానీ అది ఆరోగ్యానికి చేటు. ప్రతిరోజు నాలుగు గంటలు ఉదయం పూటనే ప్రాక్టీస్‌ చేస్తాను. 

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు గురించి వింటున్నాను. నాకు బాధపడే పరిస్థితులు ఎదురుకాలేదు. అందుకే ఇండస్ట్రీ మీద నాకు సదాభిప్రాయమే ఉంది. సినిమా ఫీల్డ్‌మీద మంచి ఫోకస్‌ ఉంటుంది కాబట్టి ఈ విషయాలపై బయటి జనాలకు కూడా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కానీ అన్నిచోట్లా ఈ వేధింపులు ఉన్నాయి. మగాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తే తప్పా వీటిని అరికట్టలేం. పిల్లాడికి తన తండ్రే రోల్‌మోడల్‌. కాబట్టి మనం జాగ్రత్తగా మసలు కోవాలి. వారిని చిన్నతనం నుంచి తల్లిదండ్రులు బాగా గైడ్‌ చేయాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా పిల్లాడేం చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. 

ఇక నా భరతనాట్యం గురువులైన చిత్రా విశ్వేశ్వరన్‌, పద్మా సుబ్రహ్మణ్యంగార్లు పలు విషయాలలో నాకు ఇన్‌స్పిరేషన్‌. ‘రావణ్‌’ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌ పాటకి కొరియోగ్రఫీ చేశాను. నిజానికి డ్యాన్స్‌ మాస్టర్స్‌ లేకపోయినా మణిరత్నం గారు పాటలను తీయగలరు. ఆ సినిమాకి అడిగారు కాబట్టి పనిచేశాను. కొరియోగ్రాఫర్‌ చెప్పింది బాగా అర్ధం చేసుకునే ఆర్టిస్ట్‌ ఉంటే పరిస్థితి సులభంగా ఉంటుంది. ఐశ్వర్యారాయ్‌కి మంచి మ్యూజిక్‌ సెన్స్‌ ఉంది. ఆమె ఉత్సాహం, ప్రతిభ నన్ను బాగా మోటివేట్‌ చేశాయి. నేను నటిని అనే విషయాన్ని మర్చిపోయి ఆ సెట్స్‌లోకి అడుగుపెట్టాను. అదొక కొత్త ఎక్స్‌పీరియన్స్‌. 

పెళ్లెందుకు చేసుకోలేదన్నది నా వ్యక్తిగత విషయం. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అయితే పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటారు. లేకపోతే సంతోషం ఉండరు అనే నిబంధన ఏమీ లేదు. ఇది కరెక్ట్‌, ఇది తప్పు అని ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి వారి పాయింట్‌ఆఫ్‌వ్యూ ఉంటుంది. అందరి అనుభవాలు ఒకేలా ఉండవు. లైఫ్‌ స్పెషాలిటీ అదే...అని ఆమె చెప్పుకొచ్చింది.

Actress Shobana Reaction on MeToo:

Shobana Latest Interview Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement