Advertisement
Google Ads BL

RRR మూవీపై ఈ కొత్త గాసిప్పేంటి?


ప్రస్తుతం హీరోలు మాత్రమే కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటులు ఎవరూ RRRకి సెట్ కాలేదు. ప్రస్తుతం రాజమౌళి ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా చూపించాలని హాలీవుడ్ నుంచి ఒక టెక్నీషియన్‌ని పిలిచి తారక్ లుక్‌ను డిజైన్ చేయిస్తున్నాడు జక్కన్న. ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్టోరీ ఏమైయి ఉంటుందన్న అనుమానాలు గత కొద్దీ రోజులు నుంచి టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది.

Advertisement
CJ Advs

ఈ నేపథ్యంలో ఫిలింనగర్‌లో ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఓ ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్‌లో వ‌చ్చిన ‘ధూమ్’ సిరీస్ ఎంత సూప‌ర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఓ గజ దొంగను పట్టుకునే పనిలో పోలీస్ ఉంటాడు. ఆ దొంగ డేట్‌, టైమ్‌, ప్లేస్ చెప్పి మరీ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అదే ‘ధూమ్‌’ స్పెషాలిటీ. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా చూపిస్తుంటారు. అందుకే ఈ సిరీస్ అంతలా హిట్ అయింది.

సరిగ్గా ఇదే పాయింట్ చుట్టూ రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ కూడా న‌డుస్తుంద‌ని స‌మాచారం. ఇందులో ఎన్టీఆర్ దొంగ.. చరణ్ పోలీస్ అని ప్రచారం జరుగుతుంది. కరెక్ట్‌గా ఇదే పాయింట్‌తో తెలుగులో నాగార్జున ‘సూప‌ర్’ వ‌చ్చింది. కానీ అది సక్సెస్ కాలేదు. అయితే ఈ మ‌ల్టీస్టార‌ర్ కి రాజమౌళి డైరెక్టర్ కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేయలేము. ‘ధూమ్‌’ని మించే రాజమౌళి సినిమా ఉంటుందని భావిస్తున్నారు ప్రేక్షకులు. డిసెంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

New Gossip on Rajamouli RRR Movie :

SS Rajamouli RRR inspired by Bollywood hit film?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs