Advertisement
Google Ads BL

కలర్ గురించి క్లాస్ పీకిన తెలుగమ్మాయ్..!


తెలుగులో తెలుగమ్మాయిలు కరువైపోతున్నారు. కలర్స్‌ స్వాతి, అంజలి, నందిత, ఈషారెబ్బా వంటి వారిలో మంచి టాలెంట్‌, గ్లామర్‌ ఉన్నా వీరికి తెలుగులో కంటే ఇతర దక్షిణాది భాషల్లోనే మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక ఈషారెబ్బా విషయానికి వస్తే ఈమె జన్మస్థలం హైదరాబాద్‌. ఏపీ, తెలంగాణలలో పెరిగి ఎంబీఎ చేసింది. ఈమెలోని అందాన్ని, టాలెంట్‌ని గమనించిన టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ తాను తీసిన ‘అంతకు ముందు.. ఆ తర్వాత’ చిత్రం ద్వారా నటిగా వెండితెరకు పరిచయం చేశాడు. సుమంత్‌ అశ్విన్‌ సరసన అందులో అనన్య పాత్రను ఈమె చేసి మెప్పించింది. 

Advertisement
CJ Advs

ఆ వెంటనే మరోసారి ఇంద్రగంటి దర్శకత్వంలోనే వచ్చిన అమీతుమీతో పాటు బందిపోటు, దర్శకుడు, అ! వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాయామాల్‌, వస్తా నీ వెనుక తోపాటు నాని నిర్మాతగా రూపొందిన ‘అ!’ చిత్రంలో కూడా కీలకపాత్రను పోషించింది. ‘ఓయ్‌’ అనే తమిళ చిత్రం ద్వారా కోలీవుడ్‌కి కూడా పరిచయం అయింది. ఈమెని నిజంగానే సరిత, భానుప్రియ, రాధిక, ఆమనిల తర్వాత బ్లాక్‌బ్యూటీ అని చెప్పాలి. చిన్నసినిమాలలో నటిస్తున్న ఈమె ఏకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దృష్టిలో పడి ఆయన ఎన్టీఆర్‌ హీరోగా తీసిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో హీరోయిన్ చెల్లెలి పాత్రను చేజిక్కించుకుంది. మరింత క్రేజ్‌ని తెచ్చుకునేందుకు మంచి పాత్రలను ఎంపిక చేసుకోవడంపై ఆమె దృష్టి సారించింది. 

తాజాగా ఆమె సోషల్‌మీడియాలో నెటిజన్లతో సంభాషించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌.. మీరు ఇంకొంచెం కలర్‌ ఉంటే మీకు తిరుగుండేది కాదు.. అని అన్నాడు. దానికి ఈషా గడుగ్గా సమాధానం ఇస్తూ, ఎందుకండీ ఈ కలర్స్‌ పిచ్చి. నాకున్న కలర్‌తో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్నా ఫర్వాలేదు గానీ హీరోయిన్లు మాత్రం తెల్లగా బుర్రగా మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉండటం మీకిష్టమా? అంటూ కౌంటర్‌ ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఆమె సుమంత్‌ హీరోగా నటిస్తున్న ‘సుబ్రహ్మణ్యపురం’లో హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి తెలుగమ్మాయిగా, బ్లాక్‌ ఈజ్‌ బ్యూటీ, బ్లాక్‌ ఈజ్‌ సెక్సీనెస్‌ అనే మాటలను భవిష్యత్తులో ఈమె నిజం చేస్తుందేమో వేచిచూడాల్సివుంది..! 

Telugu Heroine Class to Netizen:

Eesha Rebba Colour Class to Netizen
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs