భరత్ అనే నేను తర్వాత కొరటాల మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. చిరంజీవి కూడా సై రా నరసింహారెడ్డి తర్వాత కొరటాలకు కమిట్ అయ్యాడంటూ వార్తలొచ్చాయి. ఇక కొరటాల శివ కూడా మెగా పార్టీలకు అటెండ్ అవడంతో చిరు - కొరటాల కాంబో ఫిక్స్ అయినట్లుగా వార్తలొచ్చాయి. అధికారిక ప్రకటన రాకపోయినా.. చిరంజీవి సై రా నరసింహారెడ్డి సినిమా తర్వాత కొరటాలతోనే సినిమాకు సిద్దమవుతున్నాడు. ఇక కొరటాల కూడా చిరంజీవి కోసం ఒక కథను రెడీ చెయ్యడం... ఆ కథలో చిరు రెండు పాత్రలు చేయబోతున్నాడని... అలాగే చిరు సరసన తమన్నా నటించబోతుందంటూ వార్తలు వండి వార్చారు సోషల్ మీడియాలో.
అలాగే కొరటాల - చిరు కాంబో మూవీ డిసెంబర్ నుండి పట్టాలెక్కుతోంది అని కూడా అన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ - చిరు సినిమా ముహూర్తం డిసెంబర్ నుండి పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతి తర్వాత లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఫిలింనగర్ టాక్. అయితే ఈ క్రేజీ కాంబో ఆలస్యం అవడానికి కారణం... కొరటాల శివ పూర్తి స్క్రిప్ట్ ను ఇంకా చిరంజీవికి వినిపించకపోవడమే ఈ ఆలస్యానికి కారణమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కథ డెవలెప్ చేసి పనిలో బిజీగా వున్న కొరటాల శివ త్వరలోనే చిరంజీవిని కలిసి పూర్తి స్క్రిప్ట్ ను వినిపిస్తాడట.
ఇక కథ విన్నాక చిరంజీవి సంతృప్తి చెంది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం .. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి అంటున్నారు. ఇక కొరటాల ఎప్పటిలాగే ఈ సినిమాలో తనదైన మార్క్ సందేశం సమాజానికి ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉన్నప్పటికీ.. రైతు సమస్యల ప్రధానాశంగా తెరకెక్కబోతున్నది అని అంటున్నారు. ఇక ఈ సినిమా పట్టాలెక్కే లోపే చిరు సరసన నటించబోయే హీరోయిన్ ని కొరటాల బృందం సెట్ చేస్తుందట. అయితే చిరు సరసన నయనతార పేరు ముందు వినబడగా.. కొంతకాలం నుండి తమన్నా పేరు గట్టిగా వినబడుతుంది. ఫైనల్ గా ఎవరు సెట్ అవుతారో చూడాలి.