Advertisement
Google Ads BL

సెన్సేషనల్‌ నటి మంచి చిత్రంతో రీఎంట్రీ..!


తమిళ, మలయాళ భాషల్లో నజ్రియాకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈమె హీరోయిన్‌గా మంచి క్రేజ్‌లో ఉన్నప్పుడే సంచలన నిర్ణయం తీసుకుంది. యువత హృదయాలను కొల్లగిట్టిన ఆమె వివాహం తర్వాత వెండితెరకు దూరమైపోయింది. ఫాహద్‌ ఫాజిల్‌తో వివాహం జరిగిన ఆమె దాదాపు ఐదేళ్ల తర్వాత మరలా రీఎంట్రీ ఇవ్వనుంది. అందులోనూ అది అమితాబ్‌బచ్చన్‌, తాప్సిలు నటించగా, మంచి చిత్రంగా, సమాజాన్ని స్పృశించే కథాంశంతో వచ్చి ఘనవిజయం సాధించిన ‘పింక్‌’ చిత్రాన్ని తమిళ, మలయాళ రీమేక్‌ కావడం గమనార్హం.

Advertisement
CJ Advs

2016లో వచ్చిన ఈ ‘పింక్‌’ చిత్రాన్ని.. చాలా ఆలస్యంగా ‘ఖాకీ’ చిత్ర దర్శకుడు వినోద్‌ రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక హిందీలో తాప్సి పోషించిన పాత్రను నజ్రియా చేస్తుండగా, అమితాబ్‌ పాత్రను అజిత్‌ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకు అమితాబ్‌ తరహాలో న్యాయం చేయగలిగిన ఏకైక హీరో అజిత్‌ అనే చెప్పాలి. 

విభిన్నమైన కథ, కథనాలతో పాటు అజిత్‌, నజ్రియాలు నటిస్తే దీనికి తమిళంతోపాటు మలయాళం, తెలుగులో కూడా క్రేజ్‌ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ చిత్రం ఓకే అయితే అది అజిత్‌, నజ్రియా ఇద్దరికీ విభిన్న చిత్రం అవుతుందనడంలో సందేహం లేదు. మొత్తానికి ఇంత మంచి చిత్రం ఇప్పటికైనా రీమేక్‌ అవుతుండటం ఆనందం కలిగించే విషయమనే చెప్పాలి. 

Sensational Actress Re Entry with Super Hit Film :

Nazriya Nazim To Come Back With Pink Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs