Advertisement
Google Ads BL

‘సవ్యసాచి’ కొత్త కాన్సెఫ్ట్ కాదు గురూ..!


రీసెంట్‌గా రిలీజ్ అయిన నాగ చైతన్య ‘సవ్యసాచి’ ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉండటంతో.. పాత్రలు ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. చైతూ ఎడమ చేయి తన ఆధీనంలో ఉండదని ఓ సరికొత్త స్టోరీతో డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాలో చూపించనున్నాడు. ట్రైలర్ చూసిన చాలామంది సెలెబ్రెటీస్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని ఇటువంటి కాన్సెప్ట్ ఎన్నడూ వినలేదని చెప్పారు. సుకుమార్, కీరవాణిలు దీనిపై స్పందిస్తూ చాలా యునిక్ కాన్సెప్ట్ అని ఇంతకుముందెన్నడూ రాలేదని చెప్పుకున్నారు. నిజానికి ఇటువంటి కాన్సెప్ట్‌తో మన ఇండియాలో రెండు సినిమాలు వచ్చిన సంగతి మర్చిపోయారు.

Advertisement
CJ Advs

తమిళంలో గత ఏడాది రిలీజ్ అయినా ‘పీచంకాయ్’ అనే సినిమా కూడా ఇటువంటి కాన్సెప్టే. ఇందులో హీరో ఒక పిక్ పాకెటర్. దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఓ సందర్భంలో అతనికి యాక్సిడెంట్ అయ్యి ఒక చేయి పోతుంది. ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అనే జబ్బు రావడంతో ఎడమ చేయి అతని మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఈనేపధ్యంలో అతనికి ఓ రాజకీయ నాయుడు సెల్ ఫోన్ కొట్టేయాలని డీల్ వస్తుంది. మరి హీరో ఆ పనిని ఎలా పూర్తి చేస్తాడో అన్నది మిగిలిన కథ.

అలానే కన్నడలో ఇటువంటి లైన్‌తోనే ‘సంకష్ట కర గణపతి’ అనే సినిమా వచ్చింది. ఇందులో హీరో (లిఖిత్ శెట్టి) ఒక కార్టూనిస్ట్. అతనికి కూడా ఒక యాక్సిడెంట్‌లో ఎడమ చేయి పోతుంది. ఆ చేయితో తనకు తెలియకుండా చాలా సమస్యలు ఎదుర్కుంటాడు. ఈ సమస్యల నుండి హీరో ఎలా బయట పడ్డాడు అనేది సినిమా.

పైన చెప్పిన రెండు సినిమాల కథలు ‘సవ్యసాచి’ కథకు దగ్గరలో ఉంటాయి. పైగా ఈరెండు సినిమాల్లో ఎంటర్‌టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అందరు అనుకుంటున్నట్టు ఇదేమి కొత్తగా ఆలోచించిన పాయింట్ కాదు. స్క్రీన్‌ప్లే వేరే అవ్వొచ్చు కానీ పాయింట్ మాత్రం ఒక్కటే. మరీ యునిక్ పాయింట్ అయితే కాదు.

Is Savyasachi inspired by Tamil and Kannada Films?:

Rumours on Savyasachi movie Story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs