Advertisement
Google Ads BL

అబ్బా.. ఏమున్నాడురా బాబూ..!!


ఒకే సినిమాలో రెండు మూడు గెటప్స్‌తో, పలు విభిన్నమైన షేడ్స్‌ ఉన్న పాత్రలు ఉంటే అది ఆయా హీరోల అభిమానులకు, ప్రేక్షకులకు డబుల్‌ బోనాంజా అవుతుంది. చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి వారు ఇలాంటి చిత్రాల ద్వారా అభిమానులను ఎంతగానో అలరించారు. కానీ ఒకే మూవీలో డిఫరెంట్‌ గెటప్స్‌లో మహేష్‌ పెద్దగా కనిపించింది లేదు. 'నాని, నిజం, అతిథి, పోకిరి, బిజినెస్‌మేన్‌' వంటి చిత్రాలలో ఆయన అలా కనిపించారు. ఇక మహేష్‌ సామాన్యంగా ఒకే లుక్‌లో కనిపిస్తాడు గానీ లుక్స్‌ పరంగా, హెయిర్‌స్టైల్‌ నుంచి బాడీ లాంగ్వేజ్‌ వరకు డిఫరెంట్‌గా కనిపించడం తక్కువే. 

Advertisement
CJ Advs

కానీ ఆయన ఆ లోటును తన 25వ ప్రతిష్టాత్మక చిత్రం 'మహర్షి' ద్వారా పూడ్చి అభిమానులను ఆనందపరిచేందుకు రెడీ అవుతున్నాడు. దిల్‌రాజు, అశ్వనీదత్‌, పివిపిల సంయుక్త భాగస్వామ్యంలో యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలోమహేష్‌ కాస్త గడ్డం, మీసాలు పెంచి ఓ గెటప్‌లో క్లీన్‌ షేవ్‌తో ఎంతో స్టైలిష్‌, క్లాసీ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్‌ స్టిల్స్‌ విడుదలయ్యాయి. అమెరికాలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని వర్కింగ్‌ స్టిల్స్‌ చూస్తుంటే మహేష్‌ హ్యాండ్సమ్‌ లుక్‌కి అందరూ ఫిదా అయిపోతున్నారు. రిచ్‌ బిజినెస్‌మేన్‌గా ఎంతో అందంగా ఉన్న ఈయనను చూసి ఆడవాళ్లే కాదు.. మగాళ్లు కూడా అసూయపడేలా ఆయన ఉన్నాడు. బహుశా అమెరికా అమ్మాయిలు ఆయనను చూస్తే యూఎస్‌ నుంచి ఆయనను ఇండియాకు రాకుండా అక్కడే కట్టేస్తారని అనే విధంగా ఇవి ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు. 

న్యూయార్క్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఇందులో మహేష్‌ తన మునుపటి చిత్రాల కంటే ఎంతో అందంగా, గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇవి సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచి వేస్తున్నాయి. అల్లరి నరేష్‌ కీలక పాత్రను పోషిస్తున్నఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Mahesh Babu Latest Photo Creates Sensation :

Mahesh Babu New Photo Hulchal in Social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs