Advertisement
Google Ads BL

ఈ సినిమాకి ఇంకెలా టికెట్లు తెగుతాయ్..?


ఫిలిం బ్యాగ్రౌండ్, పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన నారా రోహిత్ డిఫ్రెంట్ డిఫరెంట్ టైటిల్స్ తో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుండేవాడు. అతి తక్కువ టైమ్‌లోనే నారా రోహిత్ మంచి మంచి కథలను నమ్ముకుని కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ఇక తన స్నేహితుడైన శ్రీ విష్ణుతో కలిసి రెండు మూడు సినిమాల్లో నటించిన నారా రోహిత్ తన సినిమాలకు పెట్టే టైటిల్స్ తోనే సగం క్రేజ్ కొట్టేస్తాడు. ఇక మంచి టైటిల్స్ తీసుకున్నప్పటికి.. సినిమాలో ఒక్కోసారి విషయం లేక చతికిల పడడం అనేది రోహిత్ కి అలవాటే. కానీ నారా రోహిత్ నటించే సినిమాలకు భారీ ఓపెనింగ్స్ లేకపోయినా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. ఇక తాజాగా నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు.. కొత్త దర్శకుడు ఇంద్రసేన దర్శకత్వంలో వీర భోగ వసంత రాయులు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉన్న సినిమాలో నటించారు.

Advertisement
CJ Advs

అయితే సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు కలయిక అనగానే ఎంతో కొంత ఆసక్తి అయితే ప్రేక్షకుల్లో ఏర్పడింది. ట్రైలర్, టీజర్ తో కాస్త ఆసక్తిని కలుగజేసిన మేకర్స్ ఎందుకో ఏమో.. ఈ సినిమాని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓవర్సీస్ లో రెండు రోజులముందే ప్రీమియర్స్ అంటూ హడావిడీ చెయ్యడం... అక్కడ ప్రీమియర్స్ వేసాక టాక్ తేడా కొట్టడంతో.. ఇప్పుడు ఇక్కడ తెలుగులో ఈరోజు విడుదలైన ఈసినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పోయేలా చేసింది. 

సినిమాకి ఓవర్సీస్ లో నెగెటివ్ టాక్ రావడంతో.. ఇక్కడ వీర భోగ వసంత రాయులకు క్రేజ్ లేక కనీసం టికెట్స్ కూడా అమ్ముడు పోలేదు. ఒక రాత్రి ముందు ప్రీమియర్స్ ఓవర్సీస్ లో పడినప్పటికీ.. ఇక్కడ ప్రీ బుకింగ్స్ తో ఒక వీకెండ్ కి సరిపడా టికెట్స్ అమ్ముడుపోయేవి. కానీ నారా రోహిత్ వాళ్ళు సినిమాలో ఏం చూసి ముందుగా ప్రీమియర్స్ అంటూ హడావిడీ చేశారో కానీ.. ఇప్పుడు ఇక్కడ కనీస ఓపెనింగ్స్ మాత్రం రావనే చెప్పాలి. ఏదైనా అక్కడ తొందరపడి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించి ఇక్కడ ఉన్న క్రేజ్ కూడా పోగొట్టుకున్నారనేది మాత్రం వాస్తవం.

No Craze in Latest Multistarrer Movie:

Veera Bhoga Vasantha Rayalu Movie Status at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs