Advertisement
Google Ads BL

బాబాయ్ అంటే నాకు భయం: యంగ్‌టైగర్


సీనియర్‌ రచ దిగ్గజాలు పరుచూరి బ్రదర్స్‌కి నేడు ఉన్న అందరిలోకి ఎంతో అనుభవం ఉన్న వారిగా, పెద్దమనుషులుగా ఎంతో పేరుంది. ఇక తాజాగా పరుచూరి గోపాలకృష్ణ పలు అంశాలను, సినీ సంగతులను, వ్యక్తిగత విషయాలను ఇతరులతో ‘పరుచూరి పలుకులు’ ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా ఆయన మొట్టమొదటిసారి యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, తన బాబాయ్‌ నటసింహం నందమూరి బాలకృష్ణని ఎలా కలుసుకున్నాడు? ఆ సందర్భం ఏమిటి? అనే ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. 

Advertisement
CJ Advs

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ చిత్రం ‘అల్లరిరాముడు’ సినిమా షూటింగ్‌ సందర్భంగా నేను, ఎన్టీఆర్‌, యూనిట్‌, దర్శకుడు బి.గోపాల్‌, నిర్మాత చంటి అడ్డాల వంటి వారిమి పాలకొల్లు వెళ్లాం. అప్పుడు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నాతో ‘మీరు తాతయ్య ఎన్టీఆర్‌గారికి ఎంత వీరాభిమానులో.. నేను బాబాయ్‌ బాలకృష్ణకి అంత వీరాభిమానిని. సినిమా ధియేటర్‌లో బాబాయ్‌ సినిమా చూస్తూ ఉంటే కాగితాలు చించి ఎగరేసి చిందులేస్తాను’ అని చెప్పాడు. 

మరి ఈ విషయం నువ్వు మీ బాబాయ్‌కి ఎప్పుడు చెప్పలేదా? అని ప్రశ్నించాను. ‘ఎప్పుడు చెప్పలేదండి.. మా బాబాయ్‌ అంటే నాకు చాలా భయం’ అన్నాడు. మీ బాబాయ్‌తో మాట్లాడిస్తాను ఉండు అని చెప్పి బాలయ్య బాబు దగ్గరికి ఎన్టీఆర్‌ని తీసుకెళ్లాను. ఆయనతో మాట్లాడించాను. అలా ఒక అభిమానిగా ఎన్టీఆర్‌ తన బాబాయ్‌ బాలకృష్ణతో మాట్లాడిన తొలి సన్నివేశానికి పాలకొల్లు వేదికైంది అని చెప్పుకొచ్చాడు.

Paruchuri Gopalakrishna About Balayya and Jr NTR Bond :

Interesting Conversation between Paruchuri Gopala Krishna and Jr NTR 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs