Advertisement
Google Ads BL

‘బంగారి బాలరాజు’ టీమ్‌కు ముందే దీపావళి


‘బంగారి బాలరాజు’ విజయంతో ముందుగానే మాకు దీపావళి వచ్చింది: దర్శకనిర్మాతలు 

Advertisement
CJ Advs

ఎటువంటి అంచనాలు లేకుండా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మౌత్ టాక్ తో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ సందర్బంగా చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లోని సినిమా ఆఫీస్ దగ్గర కేక్ ను కట్ చేసి, బాణాసంచాని కాల్చి దీపావళిని ఆనందంగా ముందుగానే జరుపుకుంది.

రాయలసీమలో పరువు హత్యల నేపధ్యంలో యధార్ధ ప్రేమకధతో వచ్చిన బంగారి బాలరాజు  విజయానందాన్ని మీడియాతో దర్శకుడు కోటేంద్ర దుద్యాల పంచుకుంటూ.. ‘‘బంగారి బాలరాజు విజయానికి కారకులైన ప్రేక్షక దేవుళ్లకు మరియు నా మీడియా మిత్రులకు దన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేనూ మీడియా నుండి వచ్చిన  వాడినే. నేను దర్శకుడిగా సక్సెస్ అవ్వడానికి కారణమైన ప్రొడ్యూసర్స్ కు మా చిత్రయూనిట్ కి ప్రత్యేక దన్యవాదాలు..’’ అని అన్నారు.

చిత్రహీరో రాఘవ్ మాట్లాడుతూ.. ‘‘నా మొదటి సినిమానే మంచి సక్సెస్ ను సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ కోటేంద్ర సార్ కు నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే సపోర్ట్ చేసిన మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు..’’ అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల చేశాము. కానీ కొంతమంది మా శ్రేయోభిలాషులు ఎందుకు సొంతంగా విడుదల చేసుకుని రిస్క్ తీసుకోవడం అని అనడంతో కొంత ఆందోళన చెందాము కానీ కథ మీద, దర్శకుడి మీద నమ్మకంతో 113 ధియేటర్లలో వరల్డ్ వైడ్ గా ‘బంగారి బాలరాజు’ ను విడుదల చేశాము. ఇప్పుడీ సినిమా మౌత్ టాక్ తో మా చిత్రయూనిట్ కు ముందుగానే దీపావళి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్.. సోమవారం నుండి మరిన్ని ధియేటర్స్ ను పెంచుతామని కాల్ చేస్తుండటంతో మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..’’ అన్నారు.

Bangari Balaraju Team Celebrates Movie Success:

Bangari Balaraju Movie Success meet Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs