Advertisement
Google Ads BL

‘ఆంటీలు వేసుకునే డ్రస్‌లు ఇవేనా’ అనసూయా!


తెలుగులో ప్రస్తుతం మంచి క్రేజ్‌, ఇమేజ్‌ ఉన్న నటి అనసూయ భరద్వాజ్‌. ఈమె బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. ఇటీవల వరుసగా పలు చిత్రాలలో నటించింది. ‘రంగస్థలం’ చిత్రం ఈమెకి ఎంతో మంచి పేరును, గుర్తింపును తీసుకొచ్చింది. ఈ రంగమ్మత్త చేతిలో ప్రస్తుతం అరడజను చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ‘కథనం’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక ఈమెకి ఆల్‌రెడీ వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సహజంగా పెళ్లై, పిల్లలు ఉన్న నటీమణులకు దక్షిణాదిలో పెద్ద క్రేజ్‌ ఉండదు. కానీ ఈ తరంలో దీనిని సమంత, అనసూయ వంటి వారు అధిగమిస్తున్నారు. 

Advertisement
CJ Advs

సమంత విషయం పక్కనపెడితే ఇలా ఓ ఆంటీకి ఇప్పటికీ గ్లామర్‌ వేషాలు, ఐటం సాంగ్స్‌ రావడం నిజంగా గొప్పవిషయమేనని చెప్పాలి. ఇటీవల ఆమెని కొందరు ఆంటీ. ఆంటీ.. అని అంటుంటే, ఆమె దానిపై స్పందిస్తూ నన్ను ఆంటీ అని పిలిచినా నాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే నా పిల్లల స్నేహితులకు నేను ఎప్పుడో ఆంటీని అయిపోయాను అంటూ ఘాటైన సమాధానం ఇచ్చింది. ఇక అనసూయ చేతలు, ఆమె పోస్ట్‌ చేసే విషయాలు, ఫొటోలు కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటాయి. పెళ్లైనా కూడా ఆమె తనకి నచ్చిన డ్రస్‌లు వేసుకుని సోషల్‌ మీడియాలలో హల్‌చల్‌ చేస్తూ ఉంటుంది. 

తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పొట్టి దుస్తులు వేసుకున్న ఓ హాట్‌ఫొటోని పోస్ట్‌ చేసింది. దాంతో ‘ఆంటీలు వేసుకునే డ్రస్‌లు ఇవేనా’ అని కొందరు నెటిజన్లు ఆమెపై సరదాతో కూడిన వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. సముద్రం పక్కన పొట్టి పొట్టిదుస్తులతో ఉన్న అనసూయ ‘నా జీవితం మొత్తం ఇలా సముద్రాన్ని చూస్తూ గడిపేయగలను. అలా సముద్రాన్ని చూసుకుంటూ పాడుకుంటూ, డ్యాన్స్‌లు చేసుకుంటూ ఉండిపోతాను’ అని ఆమె చెప్పిన మాటలు, ఫొటోలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కాగా ఈమె నటించిన ‘కథనం’ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది...! 

Comments on Anasuya Dress in Social Media:

Anasuya posted Her latest Photo in Instagram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs