Advertisement
Google Ads BL

చరణ్ కోసం ప్రభాస్ హీరోయిన్ ఆ పని చేస్తుందా?


బోయపాటి శ్రీను - రామ్ చరణ్ కాంబోలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. వినయ విధేయ రామ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఆ టైటిలే పక్కా అంటూ వార్తలొసున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌ను కొనసాగిస్తుంది. దసరా కానుకగా మెగా ఫ్యాన్స్ చరణ్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా అందుకుంటారనుకుంటే.. చరణ్ అండ్ బోయపాటిలు కిమ్మనకుండా ఉన్నారు. ఇక తాజాగా రాబోయే దీపావళికి రామ్ చరణ్ న్యూ మూవీ లుక్ అండ్ టైటిల్ బయటికి వస్తుందనే ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

బోయపాటి ఈ సినిమాని భారీ యాక్షన్ మూవీగా తీర్చిదిద్దుతున్నాడని... ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. ఇక అన్నదమ్ములకథ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, హీరో ప్రశాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే దేవిశ్రీ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ ఐటెం సాంగ్ ఉండబోతుందట. మామూలుగానే దేవిశ్రీ ఆల్బ‌మ్ అంటే ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే. అలాగే దర్శకుడు బోయ‌పాటికీ ఐటెమ్ సాంగ్స్ పైన మ‌క్కువ ఎక్కువే. అందుకే రామ్ చరణ్ కోసం దేవిశ్రీ ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ కి అదిరిపోయే మాస్ ట్యూన్ రెడీ చేసాడట. క్యాచీ, ట్రెండీ పదాల‌తో ఈ పాట‌ని బోయపాటి తో పాటు దేవిశ్రీ.. పాటల రచయితతో రాయిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

ఇక ఈ ఐటెం సాంగ్ కోసం ఈసారి బాలీవుడ్ భామను తీసుకొచ్చే పనిలో బోయపాటి బృందం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఐటెం గర్ల్ కింద ప్రస్తుతం సాహో లో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్దాకపూర్ ని కానీ... లేదంటే మరో హీరోయిన్ గాని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. శ్రద్ద అయితే ప్రస్తుతం సాహో తో తెలుగులో బాగా సుపరిచితురాలిగా ఉంది కాబట్టి.. ఆమెని సంప్రదించే యోచనలోనే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి సాహో చిత్రంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న శ్రద్ద కపూర్ ఈ రామ్ చరణ్ వినయ విధేయ రామ్ కోసం ఐటెం అవతారమెత్తుతుందో లేదో చూడాలి.

Prabhas Heroine in Ram Charan and Boyapati Film:

Shraddha Kapoor Item Song in Vinaya Vidheya Rama Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs