Advertisement
Google Ads BL

వెంకటేష్ బాబూ.. ఏంటీ వరస కొట్టుడు!


‘గురు’ చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న వెంకటేష్‌ ఇప్పుడు వరస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన యంగ్‌హీరోలతో కలసి రెండు మల్టీస్టారర్స్‌ చేస్తున్నాడు. దిల్‌రాజు నిర్మాణంలో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ తర్వాత ఆయన మెగాహీరో వరుణ్‌తేజ్‌తో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ నుంచి అన్ని విషయాలలోనూ పూర్తి ఎంటర్‌టైనర్‌గా సాగుతుందనే నమ్మకం కలుగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. దాంతో ఆయన ‘పవర్‌, సర్దార్‌గబ్బర్‌సింగ్‌, జైలవకుశ’ చిత్రాల దర్శకుడు బాబి దర్శకత్వంలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెండితెరపై కూడా మామా అల్లుళ్లుగా కనిపించే ‘వెంకీ మామా’ చిత్రం లైన్‌లో పెట్టాడు. వాస్తవానికి ఈ రెండు చిత్రాల తర్వాత వెంకీ.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సివుంది. కానీ అంతలోపు త్రివిక్రమ్‌ మరో యంగ్‌స్టార్‌తో చిత్రం చేయనుండటంతో ఆయన మరో యంగ్‌ దర్శకునికి అవకాశం ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

‘సినిమా చూపిస్తా మావా, నేను లోకల్‌, హలో గురు ప్రేమకోసమే’ చిత్రాల ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ని బాగా పండించే దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు ఆయన కమిట్‌ అయ్యాడు. ఈ చిత్రాన్ని కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరిలు నిర్మించనున్నారు. డి.సురేష్‌బాబు సమర్పకుడు. ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం కంటే ముందే వెంకీకి త్రినాథరావు నక్కిన ఈపాయింట్‌ చెప్పాడని, అది ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. 

మొత్తంగా చూసుకుంటే వెంకీ ప్రస్తుతం చేస్తున్న మూడు చిత్రాలు ఆయనకు ఎంతో బలమైన ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ తరహా చిత్రాలే కావడం విశేషం. బహుశా ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేయబోయే చిత్రం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి వరుస చిత్రాలతో మరలా వెంకీ తన అభిమానులను అలరించేందుకు రెడీ అవుతుండటం విశేషం. 

Venkatesh Signs One More Movie:

Venkatesh and Director Trinadharao Nakkina Combo movie Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs