Advertisement
Google Ads BL

ఆ వీడియోతో ‘సాహో’ లెక్క సరిచేశాడుగా..!!


ప్రభాస్ పుట్టిన రోజున సందర్భంగా ఆయన అభిమానులకి ఇచ్చిన ట్రీట్ అలాంటిలాంటి ట్రీట్ కాదు. ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో నటిస్తున్న భారీ చిత్రమైన సాహో చిత్రంకి సంబంధించిన షేడ్స్ ఆఫ్ సాహో ప్రభాస్ ఫాన్స్ ని మాత్రమేకాదు.. సగటు ప్రేక్షకుడిని ఉర్రూతలూగించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమాలో స్టైలిష్ లుక్ లో ఇరగదీసాడు. అయితే బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ కేవలం చిన్న దర్శకుడైన సుజిత్ ని పెద్ద ప్రాజెక్ట్ చెయ్యడానికి తీసుకోవడంపైన అందరిలో పలు అనుమానాలు తొంగి చూశాయి.

Advertisement
CJ Advs

అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని సుజిత్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఒకేసారి నేషనల్ వైడ్ గా సినిమాని ఎలా తెరకెక్కిస్తాడు.. అంటూ పలు రకాల అనుమానాలు సినిమారంగ నిపుణులు, క్రిటిక్స్, సినీ పెద్దలు కూడా వ్యక్తపరిచారు. కానీ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వదిలిన  షేడ్స్ ఆఫ్ సాహో చూశాక.. దర్శకుడు సుజిత్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అసలేమీ తెలియని సుజిత్ ఇలా ప్రభాస్ ని అన్ని రకాల భాషల వారు ఆకట్టుకునేలా టీజర్ వదిలి.. అందరిలో సాహో చిత్రంపై భారీ అంచనాలు పెంచేలా చేసాడు. సాహో యాక్షన్ ఎపిసోడ్ చూశాక సుజిత్ పనితనం మీదున్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ప్రభాస్ కోసం ఐదేళ్లుగా వెయిట్ చేసిన సుజిత్.. దానికి తగ్గ అవుట్‌ఫుట్‌ని ఇస్తున్నాడనే లెక్కని ఈ వీడియోతో క్రియేట్ చేశాడు.

నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ క్రేజ్ ని ఇసుమంతైనా తగ్గకుండా ఈ షేడ్స్ ఆఫ్ సాహో లో సుజిత్ చూపించగలిగాడు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించిన ఆ యాక్షన్ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్, విజువల్స్ అన్నీ చూసిన ఇండియన్ ప్రేక్షకుడు ఇది కేవలం బాలీవుడ్ కి, హాలీవుడ్ కి మాత్రమే సరిపోయే మూవీగా కొనియాడడం ఖాయం అంటున్నారు. మరి యాక్షన్ ఎపిసోడ్ ని హాలీవుడ్ స్టెంట్ మాస్టర్స్ పక్కన ఉన్నపుడు జరిగినా అది సుజిత్ ఆధ్వర్యంలో తెరకెక్కినవే. మరి షేడ్స్ ఆఫ్ సాహో చూశాక సుజిత్ రేంజ్ అర్ధమవుతుంది. బాహుబలితో ప్రపంచాన్ని చుట్టేసిన ప్రభాస్ సాహోతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Shades of Saaho Creates Sensation :

Sujeeth Reached Saaho expectations with Shades of Saaho 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs