Advertisement
Google Ads BL

'సవ్యసాచి' పై జెలసీగా ఫీలవుతున్నా : సుక్కు


యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ సి వి ఎం సంయుక్తంగా నిర్మిస్తోన్న డిఫరెంట్ కథా చిత్రం సవ్యసాచి. వెర్సటైల్ యాక్టర్ మాధవన్, భూమిక, ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ట్రైలర్ ని బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు.  ఈ కార్యక్రమంలో యువసామ్రాట్ నాగచైతన్య, చిత్ర దర్శకుడు చందు మొండేటి, ఎం.ఎం.కీరవాణి, కెమెరామెన్ యువరాజు, నిర్మాతలు నవీన్, రవిశంకర్, మోహన్ పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఇండియన్ స్స్క్రీన్  పైన ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. ఏ దర్శకుడుకైనా ఇలాంటి సబ్జెక్ట్ తో చేయాలని ఉంటుంది. చాలా విచిత్రమైన సబ్జెక్ట్ ఇది. నేను ఇలాంటి సబ్జెక్ట్ తో చేయనందుకు జెలసీగా ఫీలవుతున్నాను. కార్తికేయ సినిమాకి పెద్ద అభిమానిని. చందు ఈ సినిమాని చాలా బాగా తీశాడు. కీరవాణి గారి గురించి నా మిత్రుడు దేవిశ్రీప్రసాద్ చాలా గొప్పగా చెపుతుంటాడు. ఆయన మ్యూజిక్ జీనియస్. టీజర్, ట్రైలర్ లో రీ- రికార్డింగ్  అద్భుతంగా చేశారు. సాంగ్స్ కి మ్యూజిక్ బ్యూటిఫుల్ గా చేశారు. నవీన్, రవిశంకర్, మోహన్  ముగ్గురు నిర్మాతలు కూడా ఎలాంటి డెసిషన్ అయినా చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు. నవీన్ గారు మేనేజ్మెంట్, జడ్జిమెంట్, మోహన్ కోఆర్దినేషన్, రవిశంకర్ ప్లానింగ్ చక్కగా చేస్తారు. అందుకే వరసగా విజయవంతమైన సినిమాలు తీస్తున్నారు. కెమెరామెన్ యువరాజ్  విజువల్స్ ఫెంటాస్టిక్ గా చేశాడు. 100పర్సెంట్ లవ్ తర్వాత  చైతూ నేను రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. సమంత వచ్చాక ఈ మధ్య కలవడం లేదు. ట్రైలర్ లో చాలా అందంగా, క్యూట్ గా కనిపిస్తున్నాడు చైతూ. పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడు. డిఫరెంట్ ఎక్సపీరియెన్స్ ఈ సినిమా. క్లైమాక్ ఎవరూ ఊహించని రీతిలో ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

స్వరవాణి యమ్. యమ్. కీరవాణి మాట్లాడుతూ... నవీన్, రవి, మోహన్ ముగ్గురు నిర్మాతలు కూడా అందర్నీ ఫ్రెండ్లీగా కలుపుకుంటూ, గౌరవిస్తూ, వారికి కావాల్సింది రాబట్టుకుంటారు. అందుకే సక్సెస్ పుల్ గా సినిమాలు తీసుకుంటూ వెళుతున్నారు. వారికి నా కంగ్రాట్స్. చందుతో ఈ జెర్నీ ఫ్రెండ్లీగా సాగింది. గతంలో మల్టీస్టారర్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి. వస్తున్నాయి. వాటిలో ఇద్దరి హీరోలకి సమానంగా రెండు ఫైట్స్, రెండు పాటలు ఉండేలా బ్యాలెన్స్ చేస్తూ నిర్మాతలు సినిమా చేస్తారు. అవన్నీ పక్కన బెట్టి చైతన్య ఇది  మల్టీస్టారర్ ఫిల్మ్ అయినా కూడా కథకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ సినిమా చేశాడు. యువరాజ్ చైతన్యని, హీరోయిన్ నిధి అగర్వాల్ ని బ్యూటిఫుల్ గా, కలర్ ఫుల్ గా చూపించాడు. ఈ నెల 27న ఫ్రీ రిలీజ్ లో అంతా కలుస్తాం అన్నారు. 

యువసామ్రాట్ నాగ చైతన్య మాట్లాడుతూ...  నా కెరీర్ బిగినింగ్ లో హండ్రెడ్ పెర్సెంట్ లవ్ లాంటి బిగ్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన సుకుమార్ గారు సవ్యసాచి ట్రైలర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఇన్స్పిరేషన్ ఆయన. నార్వేలో షూటింగ్ లో ఉండగా చందు ఈ లైన్ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. అప్పుడే ఈ సినిమా చెయ్యాలనిపించింది. వెంటనే అడిగితే బాగోదు అని అడగలేకపోయాను. ఒక ఇంపాజిబుల్ మిషన్ ని పాజిబుల్ చేశాడు చందు. ప్రేమమ్ కి నేను సూట్ అవుతానా లేదా అని అందరూ అనుకున్నారు. చందు కన్విక్షన్ అయి  అందర్నీ కన్విన్స్ చేసి ప్రేమమ్ చేశాడు. అది బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.  ప్రేమమ్ రిలీజ్ అయ్యాక వెంటనే చందు వచ్చి అప్పుడు నార్వేలో చెప్పిన స్టోరీ చేద్దామా అని అడిగాడు. చాలా హాపీగా ఫీలయ్యాను. ఈ ప్రాజెక్ట్ కి బిగ్గెస్ట్ టెక్నీషియన్స్ యాడ్ అయ్యాక  స్కేల్ అంతా మారిపోయింది. సవ్యసాచి కంటెంట్ ని నమ్మి మైత్రి వాళ్ళు ఈ సినిమా చేశారు. ప్రతి సంవత్సరం మైత్రీలో ఒక సినిమా చేయాలని ఉంది. అంత బాగా ప్రొడక్షన్ చేశారు. కీరవాణి గారు మ్యూజిక్ పరంగానే కాకుండా స్క్రిప్టులో ఇన్వాల్వ్ అయి ఇన్ పుట్స్ లో కూడా చాలా హెల్ప్ చేశారు. ఆయనికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 27న  ప్రీ- రిలీజ్ జరిపి నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేస్తున్నాము. అందరి సపోర్ట్ కావాలి అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ... సవ్యసాచి చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకని అక్టోబర్ 27న అభిమానుల సమక్షంలో  నార్సింగ్ కన్విక్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరపనున్నాం. నవంబర్ 2న వరల్డ్ వైడ్ గా సినిమాని భారీగా రిలీజ్ చేస్తాం అన్నారు.

Savyasachi Trailer Released:

Sukku Released Savyasachi Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs