Advertisement
Google Ads BL

3 సినిమాల్లో అరవిందే టాప్!


ఈ దసరా పండగకు వారం ముందే రిలీజ్ అయిన 'అరవింద సమేత' జోరు బాక్స్ ఆఫీస్ వద్ద తగ్గిందనే చెప్పాలి. ఇప్పటివరకు ఈసినిమా 85 కోట్లు వసూల్ చేయగా.. ప్రాఫిట్స్ లోకి వెళ్లాలంటే ఇంకా 10 కోట్లు దక్కించుకుంటే కానీ సేఫ్ జోన్ లోకి వెళ్ళదు. ఓవర్ అల్ రన్ లో 10 కోట్లు దక్కించుకోడం పెద్ద కష్టమేమి కాదు అని ట్రేడ్ చెబుతుంది. ప్రస్తుతం ఉన్న సినిమాలు ఏవి పెద్దగా పోటీ లేకపోవడంతో ఇది పెద్ద కష్టమేమి కాదు.

Advertisement
CJ Advs

ఇక కరెక్ట్ గా దసరా రోజు విడుదల అయిన 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా యావరేజ్ టాక్ తో 14 కోట్ల పైచిలుకు షేర్ తెచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 24 కోట్ల బిజినెస్ జరపగా.. ప్రాఫిట్స్ లోకి వెళ్లాలంటే ఇంకా 10 కోట్లు అవసరం ఉంది. కానీ యూత్ నుంచి రిపీట్ ఆడియన్స్ వచ్చేంత మ్యాటర్ ఇందులో లేకపోవడం మైనస్ గా మారింది. సో దాంతో 10 కోట్లు రావడం కష్టం అయ్యే అవకాశం ఉంది.

ఇక అదే రోజు విడుదల అయిన విశాల్ 'పందెం కోడి 2' డిజాస్టర్ టాక్ తో థియేటర్స్ లో డల్ అయిపోయింది. 10 కోట్ల 50 లక్షల దాకా బిజినెస్ చేశారు. వీకెండ్ కలుపుకుని ఇప్పటిదాకా వచ్చింది 5 కోట్ల షేర్ మాత్రమే. ఈసినిమా సేఫ్ లోకి వెళ్లాలంటే ఇంకా 5 కోట్లు కావాల్సివుంది. డిజాస్టర్ తో ఇది చాలా కష్టమని సమాచారం. సో ఈ దసరాకు విన్నర్ గా 'అరవింద సమేత' యునానిమస్ గా గెలిచేసింది. ఇంకా 10 కోట్లు రావాల్సినప్పటికీ అవి ఏమి పెద్ద కష్టం కాదని ట్రేడ్ రిపోర్ట్.

Aravinda Sametha, Pandem Kodi and HGPK Collection Details:

Aravinda Sametha Top in Vijaya Dasami List
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs