Advertisement
Google Ads BL

యంగ్‌టైగర్‌ని సర్ ప్రైజ్ చేసిన చెల్లి!!


ప్రతి మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. కానీ కళాకారులకి మాత్రం కళాహృదయం ఎక్కువగా ఉంటుంది. వీరు బాగా సున్నిత మనస్కులుగా ఉంటారు. ప్రతి ఎమోషన్‌కి బాగా రియాక్ట్‌ అవుతూ ఉంటారు. వారి హృదయాలను తాకే విషయాలు, ప్రేక్షకుల చప్పట్లు, అభినందనలు వంటివే వారికి ఎక్కువ సంతృప్తిని ఇస్తూ ఉంటాయి. ఇక తమ మనసుకి నచ్చిన వాటిని వారు జీవితాంతం హృదయాలలో పదిలపరుచుకుంటూ ఉంటారు. వారికి డబ్బు, పారితోషికాలు అన్నింటి కంటే అవే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. 

Advertisement
CJ Advs

ఇక యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ విషయానికి వస్తే ఆయనకు తన తల్లిదండ్రులు ఎంతటి ప్రాణ సమానమో తెలిసిందే. అంతటి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే ఆయన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందాడు. దాంతో ఆయన పూర్తిగా కలత చెందాడు. అయినా వారం లోపలే తాను నటిస్తున్న 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రం షూటింగ్‌ ఆలస్యం కాకూడదని భావించి సెట్స్‌లో జాయిన్‌ అయ్యాడు. విచిత్రంగా అందులో ఆయన చితికి నిప్పంటిచే సీన్‌ని మొదటిసారిగా తండ్రి మరణానంతరమే షూట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన తన తండ్రి మరణం బాధ నుంచి కోలుకుంటున్నాడు. కానీ ఆయనకు ఆయన సోదరి, బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి ఓ మధురమైన బహుమతిని అందజేసింది. 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంపై ప్రశంసలు కురిపించిన ఆమె తన అన్నయ్యకు దసరా శుభాకాంక్షలు చెబుతూ ఓ అరుదైన బహుమతిని ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. 

తన పెదనాన్న, తారక్‌ తండ్రి హరికృష్ణకు చెందిన అరుదైన ఫొటోలను సేకరించి దానిని ఆల్బమ్ గా చేసి సీడీ రూపంలో తారక్‌కి గిఫ్ట్‌గా పంపింది. ఆ ఫొటోలను చూసి ఎన్టీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. చెల్లెలు బ్రాహ్మణికి కృతజ్ఞతలు తెలిపాడు. మొత్తానికి ఈ బహుమతి ఆయన కెరీర్‌లో 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం నిలిచిపోయినట్లుగా, ఆయన జీవితంలో నారా బ్రాహ్మణి పంపిన బహుమతి కూడా హృదయంలో చిరస్థాయిగా ఉండిపోతుందనే చెప్పాలి.

Sister Surprise to Young Tiger NTR:

Nara Brahmani Gift to Young Tiger
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs