Advertisement
Google Ads BL

ఓపెన్‌ సీక్రెట్‌ని ఇప్పుడు బయటపెట్టారు!


ఒకప్పటి సంగతి ఏమో తెలియదు గానీ నిజానికి నటులకంటే నటీమణులు తమ ప్రేమ, పెళ్లి విషయాలలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నా అలాంటిదేమీ లేదని, తాము మంచి ఫ్రెండ్స్‌ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్లకు పెళ్లి జరిగినట్లు తెలిస్తే మునుపటి క్రేజ్‌, ఇమేజ్‌, చాన్స్‌లు వంటివి తగ్గుతాయనేది వారి అభిప్రాయం. ఇందులో నిజం కూడా ఉంది. నగ్మా నుంచి ఎందరో ఇదే దారిలో నడిచారు. ఇక నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌లు, అంజలి-జై వంటి చాలా మంది ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. అయితే పెద్దలు చెప్పినట్లు కక్కు వచ్చినా.. కళ్యాణం వచ్చినా ఆగదు అనేది నిజం. ఎంతగా దాచాలని ప్రయత్నించినా అది ఏదో విధంగా బయటకు వస్తూనే ఉంటుంది. కానీ వారు మాత్రం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్లు ఇతరులకే ఏమీ తెలియదని భావిస్తూ ఉంటారు. ఇక మీడియా ఉప్పా? నిప్పా? అనే విషయం పక్కన పెడితే మీడియాకి చిన్న ఉప్పందితే చాలు.. డొంకంతా కదిలిస్తారు. నాటి అతిలోకసుందరి శ్రీదేవి నుంచి ఎందరో వివాహం కంటే ముందుగా గర్భవతులు అయిన విషయాలను మీడియానే బయటపెట్టింది. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల అనుష్కశర్మ-విరాట్‌ కోహ్లిలు కూడా కాదు కాదంటూనే మరో రెండు రోజుల్లో వివాహం చేసుకోనుండగా కూడా అలాంటిదేమీ లేదని చెప్పారు. కానీ వారి వివాహం ఇటలీలో జరగనుందని మీడియాలో హెడ్‌లైన్స్‌ వచ్చాయి. వాటిపై అనుష్కశర్మ మేనేజర్‌ మండిపడ్డాడు. ముందుగా మీడియా చెప్పినట్లే వారి వివాహం జరిగింది. ఇక మరో హీరోయిన్‌ శ్రియాశరణ్‌ కూడా తన పెళ్లికి షాపింగ్‌లు చేస్తోందని మీడియా ఫొటోలతో సహా బయటపెట్టింది. కానీ ఆమె మాత్రం తన స్నేహితురాలి వివాహం కోసమే తాను షాపింగ్‌ చేశానని వాదించింది. ముందుగా మీడియా చెప్పిన తేదీనే ఆమె వివాహం రాజస్థాన్‌లో జరిగింది. ఇక మరో బాలీవుడ్‌ ప్రేమజంట దీపికాపడుకోనే, రణవీర్‌సింగ్‌లు మధ్య ఎప్పటి నుంచో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇటీవల మాల్దీవుల్లో, శ్రీలంకలో వీరి నిశ్చితార్ధం జరిగిందని వార్తలు వచ్చాయి. వాటిని వారు ఖండించినా కూడా నవంబర్‌ 14, 15వ తేదీల్లో వీరి వివాహం ఖాయమైందని మీడియా కోడై కూసింది. కానీ వారు ససేమిరా అన్నారు. ఎట్టకేలకు మీడియా చెప్పిందే నిజమైంది. వీరిద్దరు వచ్చే నెల 14, 15 తేదీల్లో వివాహం చేసుకోనున్నామని స్వయంగా సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. 

ఇందులో వారు ‘మా కుటుంబ సభ్యుల దీవెనతో నవంబర్‌ 14, 15 తేదీలలో మా వివాహ వేడుక జరగనుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. గత కొన్నేళ్లుగా మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతలు. మేమిద్దరం పెళ్లితో ఒకటవ్వబోతున్నాం. ఈ సందర్భంగా మీ దీవెనలు కోరుకుంటున్నాము’ అని తెలిపారు. ఇంతకాలం నుంచి గాసిప్స్‌గా, రూమర్స్‌గా వచ్చిన వార్తలకు దీనితో చెక్‌ పడింది. ఇక లైన్‌లో ప్రియాంకాచోప్రా, ఇలియానా, శృతిహాసన్‌లు ఉన్నారని అంటున్నారు. మరి వారి నుంచి కూడా ఈ శుభవార్తలు అఫీషియల్‌గా ఎప్పుడు వస్తాయో వేచిచూడాల్సివుంది...! 

Ranveer Singh and Deepika Padukone to Tie Knot:

Deepika and Ranveer Wedding Date out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs