Advertisement
Google Ads BL

శూర్పణఖగా టాలీవుడ్ టాప్ హీరోయిన్!


ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటుగా హీరోల పక్కన కూడా నటిస్తున్న టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత ఇప్పుడు మరో లేడి ఓరియెంటెడ్ మూవీకి ఓకె చేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇప్పటికే యు టర్న్ తో హిట్ కొట్టిన సమంత ఇప్పుడు నందిని రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాని, నాగచైతన్యతో కలిసి శివ నిర్వాణం దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తుంది. ఇక దిల్ రాజు బ్యానర్ లో నానితో కలిసి తమిళ 96 రీమేక్ లో నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక తాజాగా ఇప్పుడు రామాయణంలో ఎంతో కీలక పాత్ర అయిన శూర్పణఖ పాత్రని సమంత పోషించబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

రామాయణంలో రావణాసురుని చెల్లెలు శూర్పణఖ, రాముడిని మోహించగా.. ఏక పత్నివ్రతుడైన రాముడు తనని కాదని లక్షణుడిని చూపించగా. లక్ష్మణుడు శూర్పణఖ చెవులు, ముక్కు కోసి పంపగా.. రావణాసురుడు కోపించి సీతనెత్తుకొచ్చి రామ – రావణ యుద్దానికి కారణమైంది. మరి రామాయణంలో రామ – రావణ యుద్దానికి కారణమైన శూర్పణఖ పాత్రను హైలెట్ చేస్తూ యానిమేషన్ డైరెక్టర్ భార్గవ్ ఒక సినిమా చేయబోతున్నానని ఎప్పుడో ప్రకటించాడు.  అయితే ఈ శూర్పణఖ పాత్రకు భార్గవ్ ముందుగా కాజల్ అగర్వాల్ ని అనుకోగా.. కాజల్ ఇప్పుడు తేజ సినిమాతో బిజీగా ఉండడంతో భార్గవ్ సమంతని సంప్రదించినట్టుగా వార్తలొస్తున్నాయి.

అయితే మాములుగా శూర్పణఖ అంటే అందరికి ఒక రాక్షసిగానే తెలుసు. కానీ ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ శూర్పణక ఓ అందమైన యువరాణి... అని ఈ సినిమాలో శూర్పణఖ గురించి ఎవరకి తెలియని విషయాలు కూడా దర్శకుడు చూపించనున్నారు అని తెలుస్తుంది. ఇక లేడి ఓరియెంటెడ్ అండ్ ప్రాధాన్యం ఉన్న పాత్రలకు సై అంటున్న సమంత ఈ సినిమా చేసేందుకు మొగ్గు చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబందించిన అనేక విషయాలు అధికారికముగా తెలియాల్సి ఉంది.

Tollywood top Heroine Played Surpanakha Role:

Samantha in Soorpanakha Role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs