Advertisement
Google Ads BL

ఆ వ్యూస్ ఏంటి? ఆ లైక్స్ ఏంటి? హిట్ పక్కా!!


తమిళ స్టార్‌ దళపతి విజయ్‌ హవా ఎలాంటిదో తాజాగా ఆయన నటించిన 'సర్కార్‌' టీజర్‌ సృష్టిస్తోన్న సంచలనాలను బట్టి తెలుస్తోంది. తమిళంలో కమల్‌హాసన్‌, విక్రమ్‌, సూర్య వంటి ఎందరో స్టార్స్‌ ఉన్నప్పటికీ మెయిన్‌గా ముగ్గురి మధ్యనే కీలకపోటీ అనేది విదితమే. ఒకరు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. రెండు అజిత్‌... మూడు విజయ్‌. ఇక రజనీ హవా ఇటీవల కొంతకాలంగా తగ్గుతూ వస్తోంది. 'రోబో' చిత్రం తర్వాత సరైన సక్సెస్‌లేని ఆయన చిత్రాలను చూసి ఆయన వీరాభిమానులు కూడా నిరాశతో పెదవి విరుస్తున్నారు. మరి రాబోయే '2.ఓ, పెట్టా' చిత్రాలతో ఆయన మరలా స్వింగ్‌లోకి వస్తాడనే ఆశలు కనిపిస్తున్నాయి. అయినా రజనీకాంత్‌ తన వయసు రీత్యా, ఆరోగ్య పరిస్థితులు రీత్యా, రాజకీయ ప్రవేశం రీత్యా త్వరలోనే ఆయన నటన నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. దాంతో రజనీ ప్లేస్‌ని అజిత్‌ దక్కించుకుంటాడా? విజయ్‌ విజయబావుటా ఎగురవేస్తాడా? అనేది కోలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. నిజానికి అజిత్‌, విజయ్‌ల మధ్య కెరీర్‌ పరంగా తీవ్ర పోటీ ఉంది. ఇద్దరికీ సరిసమానమైన ఇమేజ్‌, క్రేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నాయి. 

Advertisement
CJ Advs

ప్రస్తుతానికి మాత్రం విజయ్‌ కంటే అజిత్‌దే పైచేయి అంటున్నారు. అయినా అజిత్‌ ఇటీవల పెద్దగా వివాదాలకు ఆస్కారం లేని రొటీన్‌ యాక్షన్‌ చిత్రాలే చేస్తున్నాడు. కానీ విజయ్‌ మాత్రం 'తుపాకి, కత్తి' చిత్రాలతో పాటు 'పులి' నుంచి గుణపాఠం నేర్చుకుని పెద్ద వివాదాలకు కారణమైన 'మెర్శల్‌' చిత్రం చేశాడు. ఇది పూర్తిగా పాలిటిక్స్‌ని, కార్పొరేట్‌ వైద్యుల అవినీతిని ఎండగట్టే చిత్రం . ముఖ్యంగా కేంద్రంలోని బిజెపి సర్కార్‌ పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిపై తన గళం వినిపించి దేశవ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువుగా మారాడు. ఇక ప్రస్తుతం ఆయన మురుగదాస్‌ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్‌ పతాకంపై మారన్‌ నిర్మాతగా చేస్తోన్న 'సర్కార్‌' కూడా రాజకీయ నేపధ్యం ఉన్న చిత్రమే కావడం విశేషం. అంటే విజయ్‌, అజిత్‌ కంటే ఓ అడుగు ముందుకేసి రాజకీయాలు, సమాజంలోని సమస్యలు, అవినీతిపై చిత్రాలను తీస్తూ తనని తాను బాగా ఎస్టాబ్లిష్‌ చేసుకుంటూ ఉన్నాడు. 

ఇక ఇటీవల విడుదలైన 'సర్కార్‌' చిత్రం టీజర్‌ అదిరిపోయే లెవల్‌లో ఉంది. ముఖ్యంగా విజయ్‌ తన మేనరిజమ్స్‌తో రజనీ తరహాలో ముందుకు సాగుతున్నాడా? అనిపిస్తోంది. ఈ విషయంలో ఆయన సక్సెస్‌ అయ్యాడనే చెప్పడానికి ఈ టీజర్‌ సృష్టిస్తున్న ప్రభంజనాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. దీనిని విడుదల చేసిన 12 గంటల్లోనే 11మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఇక ఐదు గంటల్లోనే వన్‌ మిలియన్‌ లైక్స్‌ రావడం విశేషమనే చెప్పాలి. ఇది కోలీవుడ్‌ రికార్డు అని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. ఇక విజయ్‌ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ చేరిపోయిందని ఆయన అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఇందులో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రను చేసింది. '2.ఓ' తర్వాత కోలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఇదే. మరి ఈ చిత్రం తెలుగులోకి రీమేక్‌ చేస్తారా? డబ్‌ చేస్తారా? అనేది దీని ఫలితంపై ఆధారపడి ఉందని తెలుస్తోంది. 

Sarkar Teaser Creates Records:

Vijay Sarkar Creates Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs