Advertisement
Google Ads BL

బాలయ్య - ఎన్టీఆర్ మధ్య గ్యాప్ అట్టానే ఉందిగా?


బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ లు గతంలో దూరం దూరంగా ఉన్నప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి విషయంలో బాలకృష్ణతో పాటుగా నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒక్కతాటిపై నడిచింది. ఇక తర్వాత గత ఎనిమిదేళ్లుగా బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ లు ఎడ మొహం పెడ మొహంగానే ఉంటున్నారు. కళ్యాణ్ రామ్ తో మంచి సన్నిహిత సంబంధాలు మెయింటింగ్ చేస్తున్న బాలయ్య ఎన్టీఆర్ ని మాత్రం దూరం పెట్టేశాడు. ఇక వీరు కలవరేమో అనుకుంటున్న సమయంలో నందమూరి హరికృష్ణ మరణం మళ్ళీ నందమూరి ఫ్యామిలీని ఒకే తాటిపైకి తెచ్చింది. బాలకృష్ణ కూడా పాత విషయాలు మరిచిపోయి అన్నగారి మరణంతో వేదనలో ఉన్న అన్నగారి కొడుకులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లను దగ్గరికి తీసినట్లుగా కనబడేసరికి బాలయ్య మళ్ళీ ఎన్టీఆర్ ని కలిపేసుకున్నాడన్నారు.

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్ ని బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ లో తీసుకుంటున్నాడని, ఎన్టీఆర్ అరవింద సమేత వేడుకలో బాబాయ్ అబ్బాయ్ లు ఒకే వేదిక మీద కనబడతారని రకరకాలుగా ప్రచారం జరిగినప్పటికీ.. బాలకృష్ణ మాత్రం సైలెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ షూట్ లో బిజీ అయ్యాడు. అయితే తాజాగా జరిగిన అరవింద సమేత సక్సెస్ మీట్ కి కళ్యాణ్ రామ్ కోరిక మేరకు బాలయ్య వచ్చాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి బాబాయ్ ని వేడుకలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మధ్యమధ్యలో ఎన్టీఆర్ తో బాలకృష్ణ గుసగుసలు, అరవింద వేదికపైకి ఎక్కాక కూడా ఎన్టీఆర్ చెవిలో బాలకృష్ణ ఏదో చెప్పడం ఇవన్నీ చూసిన నందమూరి అభిమానుల కేరింతలు  మాములుగా లేదు.

అయితే వేదిక మీద ఎన్టీఆర్, బాలకృష్ణలు మాట్లాడిన మాటలు బట్టి చూస్తే మాత్రం ఎన్టీఆర్- బాలయ్యల మధ్యన ఇంకా సంధి ఏర్పడలేదా? అనిపిస్తుంది. ఎన్టీఆర్ తండ్రి లేని లోటు బాబాయ్ బాలయ్య తీరుస్తున్నాడని.. నాన్నగారి స్థానంలో బాబాయ్ ఈవెంట్ కి వచ్చాడని చాలా లైట్ గా మాట్లాడగా..... బాలకృష్ణ కూడా అరవింద సమేత సినిమా చూడలేదని.. ఎన్టీఆర్ గురించి పొడి పొడిగా మాట్లాడి ... మిగతా అరవింద సమేత సినిమాకి పనిచేసిన టెక్నీకల్ టీం గురించి మాట్లాడాడు. మరి ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ఒకే ఫ్రెమ్ లో ఉన్నప్పటికీ.. వారి మధ్యన ఇంకా ఎడతెగని బంధం ఏర్పడలేదనే అనుమానం మాత్రం వారి మాటలను బట్టి కలగకమానదు. ఇక నందమూరి అభిమానులు సర్దుకుపోయినా.. మిగతా వారు మాత్రం నందమూరి బాబాయ్ అబ్బాయ్ లు ఇంకా ఒక్కటవ్వలేదు అనేలా ఉంది అరవింద ఈవెంట్ లో ఎన్టీఆర్ అండ్ బాలయ్యల వాలకం.

Balakrsihna’s No Word about Jr NTR:

Balayya & NTR: Still There Is a Gap
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs