Advertisement

వర్మలాంటి వాడినే మార్చేశాడంటే..?


చాలా మంది తాము నాస్తికులమని చెబుతారు గానీ అదే సమయంలో జ్యోతిష్యం, న్యూమరాలజీ, సెంటిమెంట్లు వంటివి బాగానే పాటిస్తూ ఉంటారు. ఇక ప్రజాచైతన్య వేదికలు, జనచైతన్య నాయకులు మాత్రం తాము నాస్తికులమే అని అంటూ ఉంటారు. అందులో పనిలో పనిగా, దేవుడు లేడు..కాకరకాయ లేవంటారు. కానీ ఏదైనా అద్భుతాలు జరిగినప్పుడు మనసు మార్చుకుంటూ ఉంటారు. బాబుగోగినేని నుంచి ఎందరో దేవుడిని విమర్శిస్తారు. అయినా కూడా వారు కూడా రోమ్‌ పోప్‌నో, బుద్దుడినో ఎవరినో ఒకరిని గౌరవిస్తూ ఉంటారు. అబ్దుల్‌కలాం నుంచి నేటి ఇస్రో శాస్త్రవేత్తల దాకా శ్రీహరికోటలో రాకెట్‌ ప్రయోగాలకు ముందు పక్కనే ఉన్న సూళ్లూరుపేటలోని గ్రామ దేవత చెంగాళమ్మని దర్శించుకుని పూజలు చేస్తారు.

Advertisement

ఇక విషయానికి వస్తే రాజమౌళిలానే వర్మకూడా నాస్తికుడు. రాజమౌళి ‘బాహుబలి’లో చూపించే శివలింగం, ఆయన గుడికే వెళ్లనని చెప్పి ఇలాంటి సీన్‌ ఎందుకు తీశావని విమర్శలు ఎదుర్కొన్నాడు. మరోవైపు తాజాగా వర్మకూడా నాస్తికత్వం నుంచి వచ్చి ఆస్తికునిగా మారాడు. తిరుమల శ్రీవారిని దర్శించుని తెల్లని చొక్కా, ఎర్ర కండువా, నుదుటన బొట్టు,చేతిలో తిరుమల స్వామివారి ప్రసాదంతో ఫోజులిచ్చాడు. 

ఈసందర్భంగా తాను నాస్తికుడినే అయినా ఇలా మార్చింది మాత్రం స్వర్గీయ ఎన్టీఆరే కారణమని చెప్పాడు. అదే సమయంలో ఆయన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రమే అసలైన కథతో వస్తుందని అంటున్నాడు. ఎందరు ఏ పేర్లతో ఎన్టీఆర్‌ మీద సినిమాలు తీసినా..ఎన్టీఆర్‌ ఆశీస్సులు తనకే ఉంటాయని బాలయ్య ‘ఎన్టీఆర్‌’పై సెటైర్‌ వేశాడు.

Why did atheist RGV turn theist:

Another Stunt By Maverick Maker 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement