Advertisement
Google Ads BL

నిర్మాత బర్త్‌డే స్పెషల్: ఏరువాక, 16 ప్లస్


కె.ఎల్‌. యూనివ‌ర్సిటీ అధినేత కొనేరు స‌త్య‌నారాయ‌ణ పుట్టిన‌రోజు నేడు (అక్టోబ‌ర్ 20). ఈ సంద‌ర్భంగా ఆయ‌న నిర్మాణంలో రూపొందుతోన్న రెండు సినిమాల వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘7’ సినిమా మేకింగ్ చూసి న‌చ్చ‌డంతో ర‌మేశ్ వ‌ర్మతో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించారు. ర‌మేశ్ వ‌ర్మ నిర్మాణ సారథ్యంలో ఎ స్టూడియోస్ ప‌తాకంపై కొనేరు స‌త్య‌నారాయ‌ణ రెండు చిత్రాల‌ను నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాదిన ఈ రెండు సినిమాలు విడుద‌ల కానున్నాయి. 

Advertisement
CJ Advs

ఏరువాక‌..

ప్రేమ సాగ‌రంలో రెండు యువ జంట‌లు ఏ తీరానికి చేరుకున్నాయ‌నే క‌థాంశంతో రూపొందుతోన్న చిత్ర‌మే ‘ఏరువాక‌’. క్యూట్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో  రెండు యువ జంట‌లుగా నూత‌న న‌టీన‌టులు న‌టిస్తున్నారు. రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ర‌మేశ్ వ‌ర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

16+

టీనేజ్‌లోని ఆరుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు క‌లిసి చేసే ప్ర‌యాణంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశారనే క‌థాంశంతో రూపొందుతోన్న చిత్ర‌మే ‘16+’. సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ర‌మేశ్ వ‌ర్మ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌, సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆరుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు అంద‌రూ కొత్త‌వారిని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు. 

కాగా, ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో చేయ‌బోయే సినిమాల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు కొనేరు స‌త్య‌నారాయ‌ణ‌.

Producer Birthday special: 2 Movies Announced:

Koneru Satyanarayana Announced 2 Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs