Advertisement
Google Ads BL

ఆ మూవీతోనైనా కీర్తి బ్లాక్‌బస్టర్ కొడుతుందా?


కీర్తి సురేష్.. రామ్ సరసన నేను శైలజ, నాని సరసన నేను లోకల్ అంటూ డీసెంట్ హిట్స్ కొట్టింది. తర్వాత స్టార్ హీరో పవన్ సరసనవచ్చిన ఛాన్స్ ని ఎగిరిగంతేసి ఒప్పుకుంది. పవన్ అజ్ఞాతవాసి తో భారీ డిజాస్టర్ అందుకుంది. తర్వాత మళ్ళీ సావిత్రి మహానటి మూవీతో అందనంత ఎత్తుకు ఎదిగింది. ఆ సినిమాలో విమర్శకుల నుండి మెప్పుపొందింది. ఇక కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకుంది. రాజమౌళి మల్టీస్టారర్ దగ్గరనుండి అనేకమంది స్టార్ హీరోల సినిమాల్లో టాలీవుడ్ లో కీర్తి సురేష్ నటిస్తుందని, దానితో  పెద్ద స్టార్ హీరోయిన్‌గా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం తెలుగులో ఒక్క సినిమాకి సైన్ చెయ్యలేదు.

Advertisement
CJ Advs

కానీ మహానటి సినిమా టైం లో ఒప్పుకున్న పందెం కోడి 2, సామి స్క్వేర్, సర్కార్ సినిమాల్తో తమిళనాట బిజీ అయ్యింది. అయితే తెలుగులో కీర్తికి వచ్చిన అవకాశాలు వదిలేసిందో.. అసలు రాలేదో కానీ. తెలుగుకి మాత్రం కీర్తి సురేష్  దూరమైందని చెప్పాలి. ఇక కోలీవుడ్ మూవీస్ మీద ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్‌కి విక్రమ్‌.. సామి స్క్వేర్ తో అద్భుతమైన డిజాస్టర్ ఇవ్వగా.. ఆ సినిమాతో కీర్తి బరువు మీద కామెంట్స్ పడ్డాయి. ఇక తాజాగా విశాల్‌తో కలిసి పందెం కోడి 2 తో ప్రేక్షకులముందుకు వచ్చిన ఆమెకి ఆ సినిమాకూడా యావరేజ్ హిట్టే ఇచ్చింది. 

ఈ సినిమాలో కీర్తి నటన బావున్నప్పటికీ... చాలా చోట్ల తేలిపోయిందన్నారు. పాపం కీర్తి అని అందరూ అనుకునేలోపు.. విజయ్ - మురుగదాస్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కార్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి కానుకగా విడుదలకు సిద్దమవుతున్న సర్కార్ సినిమా టీజర్ తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం ఈ టీజర్ లో మల్టీ మిలినియర్ అయిన విజయ్ తన ఓటు ను వినియోగించుకోవడానికి ఇండియా‌కి వస్తాడు.... ఆ తరువాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ విజయ్ వెన్నంటే ఉండే పాత్ర అంటే పీఏ పాత్రలో కనిపిస్తుందనిపిస్తుంది. ఇక లుక్స్ లోను కీర్తి కాస్త సన్నగా అందంగానే ట్రెడిషనల్ గా కనబడుతుంది. మరి విజయ్ అయినా కీర్తికి బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో చూడాలి.

Keerthi Suresh Wants Blockbuster Movie:

Keerthi Suresh Hopes on Sarkar Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs