Advertisement
Google Ads BL

ప్రాఘ్నేయ ఆర్ట్ బొమ్మకి కాదంబరి క్లాప్


కాదంబరి కిరణ్ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రాఘ్నేయ ఆర్ట్ క్రియేషన్స్ చిత్రం ప్రారంభం

Advertisement
CJ Advs

డి.ఎస్. రెడ్డి నిర్మాణ సారథ్యంలో గజపతి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రాఘ్నేయ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర ప్రారంభం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ‘మనం సైతం’ కాదంబరి కిరణ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు గజపతి శ్రీనివాస్, సర్లాన రాంబాబు, సన్ మీడియా సీఈఓ గంటా స్వామి, చిత్ర హీరోయిన్ షహరి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు గజపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్రాన్ని ప్రారంభించి, మమ్మల్ని ఆశీర్వదించిన కాదంబరి కిరణ్ కుమార్‌గారికి కృతజ్ఞతలు. నూతన నటీనటులతో పాటు సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు. ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. పూర్తి వివరాలను అతి త్వరలో తెలియజేయనున్నాము..’’ అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: తలారి శ్రీనివాస్, డిఓపి: యలమంచిన ఈశ్వర్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్: జీవీవీ సత్య, శాంతారెడ్డి, మణికంఠ వారణాసి, వివిఎస్ శ్రీకర్; ప్రొడక్షన్ మేనేజర్: ఇప్పిలి అప్పారావు, డైలాగ్స్: అనిల్.కె, నిర్మాణం: డి.ఎస్.రెడ్డి, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: గజపతి శ్రీనివాస్. 

Pragneya Art Creations Production No 1 Movie Launched:

Kadambari Kiran Clap to Pragneya Art Creations Production No 1 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs