Advertisement
Google Ads BL

మంచు లక్ష్మిపై విమర్శలు: వదులుకుంటుందా?


మంచు లక్ష్మి మరో వివాదంలో చిక్కుకుని విమర్శల పాలవుతోంది. కుర్‌కురే వంటివి మనుషులకు, మరీ పిల్లలకు ఎంతో ప్రమాదకరమని తేలింది. దీనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీనిపై నిరసనలు వ్యక్తం కావడంతో వీటిని కొన్ని రాష్ట్రాలు బ్యాన్‌ కూడా చేశాయి. అలాంటి వాటికి లక్ష్మీ ఎందుకు ఒప్పుకుంది? ‘మేము సైతం’ అంటూ పబ్లిసిటీ కోసం ఆమె చేస్తోన్న కార్యక్రమంపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement
CJ Advs

చేసేది గోరంత, చెప్పేది కొండంత.. అన్నట్లుగా మరోవైపు పావలా చికెన్‌కి రూపాయి పావలా మసాలా అంటే పబ్లిసిటీలా ఈ కార్యక్రమం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇక నెటిజన్లు కూడా వీలైనప్పుడల్లా సమాజం పట్ల తనకున్న గొప్పభావాలను గురించి ఆమె చెప్పే సూక్తులు ‘కుర్‌కురే’ వంటి వాటి వల్ల ఆమెపై చెడు అభిప్రాయం వచ్చేలా చేస్తాయంటున్నారు. ఇక ఈమె తాను కోల్‌కత్తాకి వెళ్లి కుర్‌కురే తయారీ కేంద్రాన్ని తాను చూసి వచ్చానని, అక్కడ అంతా సురక్షితంగానే ఉందని ఐఎస్‌ఐ సర్టిఫికేట్‌ ఇచ్చింది. 

మరి అవే కుర్‌కురేలను తన పిల్లలు, మంచు విష్ణు పిల్లలకు ఆమె తినిపించగలదా? తాము మాత్రం బలవర్ధక ఆహారం తింటూ ఇతరులను వీటిని తినమని చెప్పడం ఎంతవరకు సబబు? మరోవైపు గతంలో చిరంజీవి థమ్సప్‌కి, పవన్‌ పెప్సికి పనిచేశారు. కానీ విమర్శలు రావడంతో తప్పుకుని వాటికి దూరంగా ఉంటున్నారు. మరి మంచు లక్ష్మి కూడా వారి బాటలో ఈ బ్రాండ్‌ అంబాసిడర్‌ను వదులుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.

Netizens Fires on Manchu Lakshmi:

Manchu Lakshmi Brand Ambassador for Kurkure Brand
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs