Advertisement
Google Ads BL

రష్మి ఏదో వ్యాధితో బాధపడుతుందట!


ప్రస్తుతం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సందడి చేస్తున్న వారిలో అనసూయ భరద్వాజ్‌, రష్మిగౌతమ్‌, శ్రీముఖిల గురించి చెప్పాలి. కానీ వీరందరిలోకి పెళ్లై పిల్లలు ఉన్నా కూడా అనసూయకి వచ్చిన క్రేజ్‌, ఆమెకి వెండితెరపై వచ్చిన హిట్లు, ఆమె నటన తెచ్చిన ప్రశంసలు మిగతా వారికంటే ఎక్కువగా, ఎన్నో మెట్లు వారికంటే పై స్థాయిలో ఆమెని కూర్చొబెట్టాయి. ఇక రష్మిగౌతమ్‌ విషయానికి వస్తే ‘గుంటూరు టాకీస్‌’తో యూత్‌ మతులు పొగొట్టి, ఇటీవల వచ్చిన ‘అంతకు మించ’ చిత్రంలో థైస్‌తో ఎక్స్‌పోజింగ్‌ చేసిన ఆమెకి సరైన ఇమేజ్ మాత్రం రాలేదనే చెప్పాలి. ఆమె నటించిన పలు చిత్రాలు బాగా ఆడకపోవడం కూడా దీనికి కారణం. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల ఆమె కాస్తబరువు పెరిగిందనే కామెంట్స్‌ బాగా వస్తున్నాయి. దానిపై స్పందించిన ఆమె రెగ్యూలర్‌ సినీ హీరోయిన్లలాగా తనకు రోజూ క్రమం తప్పకుండా వర్కౌట్స్‌ చేసే సమయం ఉండదని, బరువేమీ సమస్య కాదు.. అది ఓ సహజమైన ప్రక్రియ అని తేల్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, నాకు రోగనిరోధకశక్తి తక్కువ. 12ఏళ్ల వయసులోనే కీళ్ల వాతం వచ్చింది. అప్పుడు నేను నరకం చూశాను....అని చెప్పింది. 

సోషల్‌ మీడియాలో తాజాగా ఓ అభిమాని ఆమెని ‘ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో మీరు చీరకట్టులో ఎంతో లావుగా కనిపించారు. మీతోటి వారంతా ఎంతో స్లిమ్‌గా ఉంటున్నారు. మీరు మీ శరీరాకృతిపై శ్రద్దపెట్టకపోతే కెరీర్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించాడు. 

దానికి రష్మి సమాధానం ఇస్తూ, నేను బరువు పెరగడానికి కారణం నా నిర్లక్ష్యం కాదు. ‘రుమాటిజం’ అనే ఆరోగ్యసమస్య కారణం. అందువల్లనే బరువు పెరగడం, తగ్గడం వంటి హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. బరువు పెరగకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఆహార నియమాలు పాటిస్తున్నాను. ఈ విషయంలో నియంత్రణ కోల్పోయిన రోజున నేనే గౌరవంగా ఈ ఫీల్డ్‌ నుంచి తప్పుకుంటానని.. సమాధానం ఇచ్చింది. 

rashmi suffers with Rheumatism:

Rashmi Gautam opens up on weight gain, ageing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs