Advertisement
Google Ads BL

వరుణ్‌తేజ్ ‘అంతరిక్షం’ టీజర్ అదిరింది!


తెలుగులో కొత్తతరం దర్శకులు సంచలనాలు సృష్టిస్తూ సీనియర్లకే సవాల్‌ విసురుతున్నారు. వీరిలో 'ఘాజీ' ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డిని కూడా చెప్పుకోవాలి. అతి తక్కువ బడ్జెట్‌తో రానాతో ఆయన తీసిన మెరైన్‌ యుద్దం 'ఘాజీ' చిత్రం దర్శకునిగా, టెక్నీషియన్‌గా ఆయనకు ఎంతో పేరు తీసుకుని వచ్చింది. ప్రేక్షకులకు సాధారణంగా అర్ధం కాని సబ్జెక్ట్‌తో కూడా ఆయన మెప్పించిన తీరు అమోఘం. ఇక ప్రస్తుతం ఆయన మెగాహీరో వరుణ్‌తేజ్‌తో 'అంతరిక్షం' చిత్రాన్ని తీస్తున్నాడు. ఇది తెలుగులో రూపొందుతున్న తొట్టతొలి స్పేష్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రం టీజర్‌ అద్భుతంగా ఉంది. టీజర్‌ని సింపుల్‌గా కట్‌ చేసినా కూడా తనదైన మేకింగ్‌ స్టైల్‌, క్వాలీటీని కూడా చూచాయగా చూపించారు. 

Advertisement
CJ Advs

మనదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిహిర స్పేస్‌ ప్రాజెక్ట్‌లో వరుణ్‌తేజ్‌ ఉంటాడు. తన సహచరులైన అదితీరావు హైదరి, సత్యదేవ్‌లతో అక్కడికి చేరుకుంటాడు. కానీ అనుకోని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. దీన్ని వదిలేస్తే అది దేశానికే అప్రతిష్టగా ఫీలయి దానిని చాలెంజింగ్‌గా తీసుకుంటాడు. కృత్రిమ శ్వాస తీసుకుంటే ఈ టీం అంతరిక్షంలో ఏమి చేసిందనేది అసలు పాయింట్‌ అని అర్ధమవుతోంది. అద్భుతమైన క్వాలీటీతో స్టన్నింగ్‌ విజువల్స్‌తో తనలోని టాప్‌ టెక్నీషియన్‌ని సంకల్ప్‌ మరోసారి చూపించాడు. 

ఇది హాలీవుడ్‌ స్పేస్‌ చిత్రాలు చూసిన వారికి కూడా థ్రిల్లింగ్‌ని ఇచ్చేవిధంగా ఉంది. దీనికి తోడు అసలైన ఎమోషనల్‌ డ్రామా, లవ్‌స్టోరీస్‌ కూడా ఉండటంతో సంకల్ప్‌ ప్రయత్నం కమర్షియల్‌గా కూడా సక్సెస్‌ కావడం ఖాయమనిపిస్తోంది. టీజర్‌లో అదితీరావు హైదరీని చూపించారు గానీ లావణ్య త్రిపాఠిని మాత్రం చూపించకుండా సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేశారు. కాగా ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్దమవుతోంది.

Click Here For Teaser

Anthariksham Teaser Released:

Anthariksham Teaser Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs